Nagarjuna: స‌మంత నాగ‌చైత‌న్య‌ల విడాకులపై మొద‌టిసారి స్పందించిన నాగార్జున‌.. ఏమ‌న్నారంటే..

|

Jan 22, 2022 | 2:57 PM

Nagarjuna: ఏం మాయ చేశావే సినిమాతో మొద‌లైన చై, సామ్‌ల బంధంల ప‌రిణ‌యంగా మారి చివ‌రికి విడాకుల‌తో ముగిస‌న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు తీసుకున్న ఈ నిర్ణ‌యం వారి కుటుంబ స‌భ్యుల‌ను ఎంత‌గా బాధించిందో, అభిమానుల‌ను సైతం అంతే ఆవేద‌న‌కు..

Nagarjuna: స‌మంత నాగ‌చైత‌న్య‌ల విడాకులపై మొద‌టిసారి స్పందించిన నాగార్జున‌.. ఏమ‌న్నారంటే..
Follow us on

Nagarjuna: ఏం మాయ చేశావే సినిమాతో మొద‌లైన చై, సామ్‌ల బంధంల ప‌రిణ‌యంగా మారి చివ‌రికి విడాకుల‌తో ముగిస‌న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు తీసుకున్న ఈ నిర్ణ‌యం వారి కుటుంబ స‌భ్యుల‌ను ఎంత‌గా బాధించిందో, అభిమానుల‌ను సైతం అంతే ఆవేద‌న‌కు గురి చేసింది. ఎంతో మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చూడ ముచ్చ‌ట‌గా ఉండే జంట విడిపోవ‌డంపై ర‌క‌రాక‌ల కామెంట్లు పెట్టారు. అయితే ఇదే క్ర‌మంలో కొంద‌రు మాత్రం అటు స‌మంత‌, ఇటు నాగార్జునను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. స‌మంత బోల్డ్ పాత్ర‌లు చేయ‌డం నాగార్జున‌కు న‌చ్చ‌లేద‌ని, అక్కినేని కుటుంబం స‌మంత‌కు సినిమాల విష‌యంలో కండిష‌న్స్ పెట్టిందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు తెగ హ‌ల్చ‌ల్ చేశాయి. ఒకానొక స‌మ‌యంలో త‌నపై జ‌రుగుతోన్న త‌ప్పుడు ప్ర‌చారానికి వ్య‌తిరేకంగా సామ్ కోర్టు మెట్లు ఎక్కిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ వార్త‌ల‌పై ఇటు నాగ‌చైత‌న్య కానీ నాగార్జున కానీ ఎప్పుడూ స్పందించింది లేదు అయితే తాజాగా తొలిసారి నాగార్జున చైసామ్ విడాకుల వ్య‌వ‌హారంపై ఓపెన్ అయ్యారు. ఇటీవ‌ల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాగార్జున ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మంత నాగచైత‌న్య‌ల విడాకుల విష‌య‌మై వ‌చ్చిన వార్త‌ల‌పై స్పందిస్తూ.. ‘‘కావాల‌నే కొంత మంది ఇలాంటి చెత్త వార్త‌లు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి ఫేక్ వార్త‌ల‌కు వేదిక‌గా మారుతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నేను ప‌ట్టించుకోను.

పండ్లు ఉన్న చెట్టుకు రాళ్ల‌నే విష‌యాన్ని బ‌లంగా న‌మ్ముతాను. అందుకే నా గురించి జ‌రిగే ప్ర‌చారాల‌పై స్పందించ‌ను. కానీ నా కుటుంబం గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌డం, న‌న్ను ఎంతో బాధించింది’’ అంటూ నాగార్జున ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక ఇదే విష‌య‌మై నాగ‌చైత‌న్య సైతం మాట్లాడుతూ.. అలాంటి వార్త‌లు నేను ప‌ట్టించుకోను అని సింపుల్‌గా చెప్పేశారు.

Also Read: Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 10 ఆహారాలను మీ డైట్‌లో చేర్చాల్సిందే..!

NRI Investments: ఎన్ఆర్ఐల చూపు వాటి వైపే.. భారత్‌లో ఆ రంగాల్లో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?