AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి టాలీవుడ్‌లో పైరసీ కలకలం.. రిలీజ్ అయినా రోజే ఆన్‌లైన్‌లోకి.. పోలీసుల కేసు నమోదు!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పైరసీ బెడద. నిన్న రిలీజ్ అయిన సినిమాలు వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అవ్వడం నిర్మాతలకు షాక్ ఇస్తుంది. ఓ పైరసీ సైట్ లో ఓం, ఆకాశంలో ఒక తార, ఆదర్శ కుటుంబం, కల్ట్ సినిమాలని అప్‌లోడ్‌ అయ్యి ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కర్నూలు సిటీ స్క్వేర్ మాల్‌లో రికార్డ్ చేసినట్టు ఆధారాలు సేకరించారు పోలీసులు. ఫోరెన్సిక్ అనాలసిస్ ద్వారా పోలీసులు గురించారు. దీని పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు చేసింది

మరోసారి టాలీవుడ్‌లో పైరసీ కలకలం.. రిలీజ్ అయినా రోజే ఆన్‌లైన్‌లోకి.. పోలీసుల కేసు నమోదు!
Piracy Movie
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2026 | 11:27 AM

Share

టాలీవుడ్‌ను పైరసీ భూతం మరోసారి వెంటాడుతోంది. నిర్మాతలు, దర్శకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్రమంగా సినిమాలను రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఘటనలు ఆగడం లేదు. తాజాగా కొన్ని తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా కర్నూలులోని ఓ మల్టీప్లెక్స్‌లో సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసినట్లు గుర్తించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు థియేటర్‌లో రహస్యంగా రికార్డింగ్. ఈ ఘటనలో ప్రధానంగా మూడు సినిమాల పైరసీ వెలుగులోకి వచ్చింది. రణబలి, #కల్ట్, ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్న సమయంలో రహస్యంగా రికార్డ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మూడు సినిమాల పైరసీ ప్రింట్లను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సిటీ స్క్వేర్ మాల్‌లో ఉన్న సినిమా థియేటర్ నుంచి రికార్డింగ్ జరిగినట్లు గుర్తించారు. విడుదలైన రోజే మరో సినిమా పైరసీ. ఇదిలా ఉంటే నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఆకాశంలో ఒక తార సినిమా కూడా పైరసీకి గురైంది. సినిమా విడుదలైన రోజే అక్రమంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఫిల్మ్ ఛాంబర్ గుర్తించింది. దీంతో కొత్త సినిమాలను లక్ష్యంగా చేసుకుని పైరసీ ముఠాలు పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పైరసీ పర్యవేక్షణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ఈ అక్రమ వ్యవహారాన్ని గుర్తించింది. go2.india4movies.click వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించి సంబంధిత వివరాలను సేకరించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ మనీంద్ర బాబు యర్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. పైరసీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించాలని, సినిమాలను రికార్డ్ చేసిన థియేటర్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, షో వివరాలు, టికెట్ బుకింగ్ రికార్డులను పరిశీలించాలని కోరారు. అలాగే ఆకాశంలో ఒక తార సినిమాను వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేసిన వ్యక్తుల వివరాలను కూడా వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం పైరసీ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.? థియేటర్‌లో సినిమాలను రికార్డ్ చేసింది ఎవరు ? వెబ్‌సైట్ నిర్వాహకులు ఎక్కడి నుంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. పైరసీ కారణంగా వారి ఆదాయానికి గండిపడుతోంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన వెంటనే సినిమాలు ఇంటర్నెట్‌లోకి రావడం వసూళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పైరసీని అరికట్టేందుకు ఫిల్మ్ ఛాంబర్, సైబర్ క్రైమ్ విభాగాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం సినీ పరిశ్రమకు ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రిలీజ్ అయినా రోజే ఆన్‌లైన్‌లోకి.. పోలీసుల కేసు నమోదు!
రిలీజ్ అయినా రోజే ఆన్‌లైన్‌లోకి.. పోలీసుల కేసు నమోదు!
ఉప్పులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా..? థైరాయిడ్ సమస్యలను నివారించే
ఉప్పులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా..? థైరాయిడ్ సమస్యలను నివారించే
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ట్రైన్‌లో వీటిపై నిషేదం
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ట్రైన్‌లో వీటిపై నిషేదం
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? రూల్స్ తెలుసా?
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? రూల్స్ తెలుసా?
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర!
మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే!
మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే!
"Huawei" నుంచి ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ ఫోన్ లాంచ్..!
ఆ రెండు రోజులు నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్
ఆ రెండు రోజులు నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్
పెద్ద స్థాయిలో ఉండాల్సిన వాడు.. చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బుల
పెద్ద స్థాయిలో ఉండాల్సిన వాడు.. చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బుల
ఫ్లై దుబాయ్ దాడిలో ట్విస్ట్.. భారత లింకుల కోసం ఎన్‌ఐఏ వేట!
ఫ్లై దుబాయ్ దాడిలో ట్విస్ట్.. భారత లింకుల కోసం ఎన్‌ఐఏ వేట!