Republic Movie: ‘రిపబ్లిక్‌తో తేజ్‌ ఒకేసారి పది మెట్లు ఎక్కారు’.. అదరగొడుతోన్న ట్విట్టర్‌ రివ్యూలు. ఇంకా ఏమన్నారంటే..

|

Oct 01, 2021 | 8:32 AM

Republic Twitter Review: సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రిపబ్లిక్‌'. సమకాలీన రాజకీయాలను ఇతివృత్తంగా చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి...

Republic Movie: రిపబ్లిక్‌తో తేజ్‌ ఒకేసారి పది మెట్లు ఎక్కారు.. అదరగొడుతోన్న ట్విట్టర్‌ రివ్యూలు. ఇంకా ఏమన్నారంటే..
Follow us on

Republic Twitter Review: సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్‌’. సమకాలీన రాజకీయాలను ఇతివృత్తంగా చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే దేవకట్ట ఈ అంచనాలు అందుకున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వహించిన స్పెషల్‌ షో చూసిన కొందరు సెలబ్రిటీలు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దేవకట్ట అద్భుతమైన దర్శకత్వం, సంభాషణలు.. తేజ్‌ అద్భుత నటన సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయని సోషల్‌ మీడియా వేదికగా కొందరు సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అభిమానులు చేస్తోన్న కొన్ని ట్వీట్లపై ఓ లుక్కేయండి..

తేజ్‌ నటన అద్భుతం..

సినిమా చూసిన ఓ సినీ లవర్‌ స్పందిస్తూ.. ‘సినిమా చూస్తున్నంత సేపు ఆలోచించేలా ధియేటర్ బయటకి వచ్చాక కూడా మనసులో నిలిచే చిత్రం రిపబ్లిక్ , సుప్రీమ్ హీరో నటనలో పది మెట్లు ఎక్కినట్లు అనిపించింది. ఎన్నో మంచి సన్నివేశాలు సంభాషణలు ఉన్నాయి’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఆలోచనలు రేకెత్తించే చిత్రం..

ఇక మరో నెటిజన్‌ స్పందిస్తూ.. ‘రిపబ్లిక్‌ ఆలోచనలను రేకెత్తించే చిత్రం, దేవకట్ట అద్భుతంగా రాశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఈ సినిమా ప్రతిబింబిస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

తేజ్‌ మునుపెన్నడూ లేని విధంగా..

ఓ నెటిజన్‌ సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌ ‘నువ్వు వ్యవస్థలో ఉండకపోతే.. వ్యవస్థ నుంచి బయటకు పోవాల్సి వస్తుంది’ అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. ‘ఇది దేవకట్టా నిజాయితీతో చేసిన సినిమా. సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటి వరకు చేసిన అత్యుత్తమ నటన’ అంటూ రాసుకొచ్చారు.

ప్రతీ సన్నివేశంలో దేవకట్టా కనిపిస్తున్నారు..

‘రిపబ్లిక్‌ ఫస్టాఫ్‌ అద్భుతంగా ఉంది. ప్రతీ సన్నివేశంలో దేవకట్టా కనిపిస్తున్నారు. సినిమాలో ఒక్క అనవసర సన్నివేశం లేదు’ అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చారు.

మరికొన్ని ట్వీట్లు..

ఇలా మొత్తం మీద చూసుకుంటే చాలా రోజుల తర్వాత తిరిగి థియేటర్లలో సందడి కనిపిస్తోంది. మొన్న లవ్‌స్టోరీ, నేడు రిపబ్లిక్‌ ఇలా థియేటర్లలో విజయవంతమైన సినిమాలు నడుస్తూ మళ్లీ సినిమా పండుగ వచ్చిందని మూవీ లవర్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇక రానున్నది పండుగ సీజన్‌ కావడంతో థియేటర్లలో మరింత రద్దీ పెరిగే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. మరి రిపబ్లిక్‌ కలెక్షన్ల విషయంలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుంది.? తేజ్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Also Read: Sunitha: అందాల కోయిల‌మ్మ‌ నీ అందమైన చిరునవ్వుకు కారణమేంటమ్మ.. వైరల్‌ అవుతోన్న సునీత లేటెస్ట్‌ ఫోటోలు.

Republic Movie: రిపబ్లిక్‌ సినిమా రాజకీయాలకు అతీతంగా అందరూ అనుభవించాల్సిన ప్రయాణం.. సింగర్‌ స్మిత మూవీ రివ్యూ.

Deepthi Sunaina: హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని వయ్యారం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దీప్తి సునైనా