
F3 Movie: వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోగా వచ్చిన ఎఫ్2 చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వుకునేలా చేసిందీ సినిమా. అటు వరున్, ఇటు వెంకటేస్ ఇద్దరూ పోటీపడి మరీ ఈ సినిమాలో నటించారు. 2019లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాక్సాఫీస్ ముందు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
అయితే తాజాగా కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. సోమవారం ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్బు’ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందుకు ఒకరోజు ముందే ప్రేక్షకులకు చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.
ఆదివారం ఈ పాట ప్రోమోను విడుదల చేసింది. దీంతో పాటతో పాటు సినిమాపై కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. మొదటి నుంచి చెబుతున్నట్లు ఈ సినిమా పైసా చుట్టూ తిరిగే కథతో రానుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ప్రోమోలో వచ్చే ‘పైస ఉంటే లోకమంతా డ్యాన్స్ క్లబ్’ అనే చరణం ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సీక్వెల్ చిత్రంలోనూ తమన్నా, మెహరీన్ జంటగా నటిస్తున్నారు. మరి సోమవారం విడుదలయ్యే ఫుల్ సాంగ్ సినిమాపై మరెన్ని అంచనాలు పెంచుతుందో చూడాలి.
Lata Mangeshkar: లతాజీ మరణానికి కారణమిదే.. ఆమెకు చికిత్సనందించిన డాక్టర్ ఏమన్నారంటే..
Chanakya Niti: మనిషిలో ఈ 5 లక్షణాలు ఉండాలి.. లేనివారి జీవితం జంతువుతో సమానం అంటున్న చాణక్య..