AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య దేవుడులాంటి వ్యక్తి.. దునియా విజయ్ ఆసక్తికర కామెంట్స్

శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు.

Balakrishna: బాలయ్య దేవుడులాంటి వ్యక్తి.. దునియా విజయ్ ఆసక్తికర కామెంట్స్
Duniya Vijay , Balakrishna
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2023 | 8:25 PM

Share

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులను అలరించనుంది.  బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా అలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ‘వీరసింహారెడ్డి’ లో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు గోపీచంద్ గారు ఇందులో నా పాత్ర గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ‘వీరసింహారెడ్డి’ కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణ గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం అని అన్నారు.

ఇవి కూడా చదవండి

బాలకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటింది ఆయనతో కలసినటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్ లో చూసినప్పుడు నన్నునేను నమ్మలేకపోయాను. ఇక ఈ సినిమా ఫైట్స్ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. వేరే ఎనర్జీ వుంటుంది. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్ లో ఫీలౌతారు. ఇందులో బాలకృష్ణ గారితో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. ఆయన ఎనర్జీ, పని పట్ల అంకితభావం గొప్పగా వుంటుంది. అలాంటి ఎనర్జీ, డెడికేషన్ మాకూ కావాలి. బాలకృష్ణ గారిని ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది అని అన్నారు దునియా విజయ్.

Follow Us
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం!
రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం!