Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమై ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది నటి రష్మిక మందన్నా. తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే ఈ బ్యూటీ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. పుష్ప చిత్రంలో డీ గ్లామర్ రోల్‌లో నటించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, యాడ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఆరోగ్యం విషయమై ఓ వైద్యుడిని సంప్రదించింది.
దీంతో తమ అభిమాన నటికి ఏమైందా అని ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోయారు. అయితే ఈ విషయమై డాక్టర్ అధికారికంగా స్పందించారు. ప్రముఖ డాక్టర్ ఏవీ గురువా రెడ్డి ఫేస్‌బుక్ వేదికగా తనను కలిసిన సెలబ్రిటీల ఫొటోలను షేర్ చేస్తుంటారు. గతంలో ప్రకాశ్ రాజ్‌తో పాటు మరికొందరు ఫొటోలను షేర్ చేసిన ఆయన తాజాగా రష్మికతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.
ఇంతకీ రష్మిక తనను ఏ సమస్య కోసం సంప్రదించడానికి వచ్చిందో కాస్త ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై ఆయన పోస్ట్ చేస్తూ.. ‘”నువ్వు ‘సామి..సామి..’ అంటూ మోకాళ్ల మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!” అని మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకు వచ్చిన ‘శ్రీవల్లి’కి సరదాగా దవి విరుస్తూ ఇలా అన్నాను. పుష్ప సినిమా చుసిన మొదలు, రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది. బన్నీ కూడా త్వరలో షోల్డర్ పెయిన్‌తో వస్తాడేమో’ అంటూ సరదాగా రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నేషనల్ క్రష్‌కు ఏమైందో అని కంగారుపడుతోన్న ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప2తో పాటు, విజయ్‌తో వారసుడు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ఇప్పటికే గుడ్‌బై చిత్రాన్ని పూర్తి చేసిన రష్మిక.. మిషన్ మజ్నూ, యానిమల్ చిత్రాలతో బీటౌన్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..