AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సినిమారా అయ్యా.! మైండ్ లోనుంచి పోవట్లా.. దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా..

ఈ మధ్యన జనాలు ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీలో అయితే ఎగబడి చూస్తున్నారు. హారర్ సినిమాల క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా హారర్ సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు .

ఏం సినిమారా అయ్యా.! మైండ్ లోనుంచి పోవట్లా.. దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2026 | 12:40 PM

Share

హారర్ సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఓటీటీల పుణ్యమా అని ఆడియన్స్ ఇతర భాషల హారర్ సినిమాలు కూడా చూస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా హారర్ థ్రిల్లర్ జానర్ మూవీనే. తల్లీ కూతుళ్ల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమా ఒంటరిగా చూడకపోవడమే బెటర్. ప్రతి సీన్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయి. ప్రతి సీన్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ పై కూర్చోబెడుతుంది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమా చూడటాన్ని ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకూ ఈ సినిమా ఏంటంటే..

కథ విషయానికి వస్తే.. అంబిక భర్త శుభంకర్ అనూహ్యంగా చనిపోతాడు. దీంతో ఆమె జీవితం తలకిందులైపోతుంది. ఈ క్రమంలోనే అంబిక కొన్ని ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి తన చిన్న కుమార్తె శ్వేత తో కలిసి చంద్రపూర్ అనే తన పూర్వీకుల గ్రామానికి వెళ్తుంది. అయితే ఈ ప్రయాణంలో ఆ ప్రాంతాన్ని చాలా సంవత్సరాలుగా ఒక అదృశ్య శక్తి వేధిస్తుంటుంది. ఈ క్రమంలో ఎంతో మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని అంబిక తెలుసుకుంటుంది. చివరకు తన కూతురికి కూడా అదే పరిస్థితి దాపరిస్తుంది. అమ్మాయికి మొదటి రుతుస్రావం అయిన తర్వాత ఆమె భయంకరమైన రాక్షసునికి లొంగిపోతుందని అంబిక తెలుసుకుంటుంది. ఆ రాక్షసుడి ఆత్మ ఒక పగతో నిండిన చెట్టులో ఉందని ఆమెకు అర్థమవుతుంది. మరి తన కుమార్తెను, అదృశ్యమైన ఇతర అమ్మాయిలను రక్షించడానికి ఆ తల్లి ఏం చేసింది.?

ఆ రాక్షసుడిని ఎలా అంతమొందించింది? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా పేరు మా. కాజోల్ ప్రధాన పాత్రలో నటించింది. తనూజ దేవ్‌గణ్‌, రోనిత్‌రాయ్‌, సుభద్ర సేన్‌గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవగన్ పిక్చర్స్ బ్యానర్ పై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. అలాగే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 22 నుంచి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ‘మా’ స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ కాబట్టి హిందీతో పాటు తెలుగు వెర్షన్ లోను ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us