
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లితో టాలీవుడ్ మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నిహారిక పెళ్లికి సంబంధించిన ముచ్చటే మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 9న జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వేడుక జరగనుంది. హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా పెడుతున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకలకు సన్నద్ధమవుతున్నారు.
అయితే మెగా కుటుంబంలో ఎవరి పెళ్లి జరిగినా అందరు కలిసి డ్యాన్సులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ చిరంజీవి స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వారు కూడా సంగీత్‌లో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. మరి నిహారిక పెళ్లికి కూడా అంతే ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మెగా సభ్యులు. ఇదిలా ఉంటే గిప్టులు కూడా ఎవరి రేంజ్‌కు తగ్గట్టుగా వారు తీసుకొస్తారు. ఇందులో చిరు గిప్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి మెగా డాడీ పెళ్లికూతురుకు ఎలాంటి బహుమతి ఇవ్వనున్నారో తెలుసా. ఏకంగా కోటిన్నర విలువ చేసే ఓ ప్రత్యేక ఆభరణాన్ని సిద్దం చేశాడని సమాచారం. అంతేకాదు అల్లుడికి కూడ అదిరిపోయే గిప్ట్ రెడీ చేశారట. ఇక చిరంజీవి భార్య సురేఖ ఇప్పటికే ఉదయ్‌పూర్ వెళ్లి పెళ్లి పనులను చూసుకుంటుంది. కాగా మెగస్టార్ మాతం ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. రేపో మాపో పయనమవుతారు.