Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

|

Jan 10, 2025 | 11:45 AM

సినీరంగంలో నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ సెలబ్రెటీల ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకునే తారలు చాలా మంది ఉన్నారు. కొందరు తమ వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. ఈ నటి కూడా అలాంటి జాబితనే.

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Vanitha Vijay Kumar
Follow us on

ఆమె తండ్రి సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు. తల్లి ఒకప్పటి హీరోయిన్ కమ్ యాక్టర్. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక వీరిద్దరి కూతుర్లు, కొడుకు ప్రస్తుతం సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఒక కూతురు మాత్రం మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ పర్సనల్ విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలిచి పాపులర్ అయ్యింది. గత 7 ఏళ్లలో మూడు సార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఇప్పటికీ ఒంటరి జీవితం గడుపుతుంది. అటు తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? వనితా విజయ్ కుమార్. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయిన తన నటనతో ఆకట్టుకుంది.

కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్, దివంగత నటి మంజుల దంపతుల వారసురాలిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చంద్రలేఖ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వనీతా విజయ్ కుమార్.. ఆ తర్వాత దేవి సినిమాతో తెలుగులో మరింత పాపులర్ అయ్యింది. దేవి సినిమా తర్వాత తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మాణిక్కం, హిట్లర్ బ్రదర్స్ వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ముందుగా నటుడు ఆకాష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆకాష్ తో విడాకులు తీసుకుంది వనితా.

ఆ తర్వాత కొన్నాళ్లుగా ఒంటరిగా గడిపిన ఆమె వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి జయనిత అనే కుమార్తె జన్మించింది. కానీ ఆ బంధం సైతం ఎక్కువరోజులు సాగలేదు. చివరకు రెండో భర్తతో సైతం డివోర్స్ తీసుకుంది. రెండుసార్లు విడాకుల తర్వాత చాలా కాలం ఒంటరిగానే గడిపిన వనితా.. గతేడాది పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. కానీ వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొన్నాళ్లకు పీటర్ పాల్ అనారోగ్య కారణాలతో మరణించాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా.. ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది.

ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఇటివలే కొరియోగ్రాఫర్ రాబర్ట్ రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే కేవలం తమ నెక్ట్స్ మూవీ ప్రమోషన్స్ కోసమే ఆ ప్రచారం జరిగిందని తెలిసింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.