AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: నిశీధి వేళలో ఎల్లోరా శిల్పమా.. నగుమోము దాచావా కురుల వెనుక.. ఎవరో కనిపెట్టగలరా?

పైన ఫోటోలో కురుల వెనకాల నగుమోము దాచుకున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టగలరా.? నిశీధి వేళలో ఎల్లోరా శిల్పంలా..

Viral Photo: నిశీధి వేళలో ఎల్లోరా శిల్పమా.. నగుమోము దాచావా కురుల వెనుక.. ఎవరో కనిపెట్టగలరా?
Tollywood Heroine
Ravi Kiran
|

Updated on: Dec 20, 2022 | 5:51 PM

Share

పైన ఫోటోలో కురుల వెనకాల నగుమోము దాచుకున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టగలరా.? నిశీధి వేళలో ఎల్లోరా శిల్పంలా ఉన్న ఈ హీరోయిన్ టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే.. కానీ అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు మాత్రం అందుకోలేకపోయింది ఈ అందాల భామ. ఈమె కెరీర్‌లో 5 సినిమాలు చేయగా.. 2 సూపర్ హిట్స్ అందుకుంది. ఎవరో గుర్తుపట్టారా.? ఇంకా కనిపెట్టలేకపోయారా? మీకోసం మరికొన్ని క్లూస్.. ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. ఈపాటికి మీకే అర్ధమై ఉంటుంది. మనం మాట్లాడుకునేది మరెవరో కాదు హీరోయిన్ ప్రియాంక జువల్కర్.

2017లో ‘కలవరమాయే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రియాంక జువల్కర్. ఆ తర్వాత 2018వ సంవత్సరంలో విడుదలైన ‘టాక్సీవాలా’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అనంతరం ఆమె నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలవగా.. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ ఏడాది ‘గమనం’ అనే సినిమాతో ప్రియాంక జువల్కర్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.