Naga Shaurya: నాగశౌర్య సొంత మేనత్త పెద్ద నటి అని మీకు తెల్సా..? ఎన్నో సినిమాల్లో
నాగ శౌర్య తల్లిదండ్రులు శంకర ప్రసాద్ మూల్పూరి, ఉషా ముల్పూరిలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి కొడుకు నాగశౌర్యతో పాటు బయట హీరోలతోనూ సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు సినిమా ప్రొడక్షన్‌కు బ్రేక్ ఇచ్చి.. ఉషా ముల్పూరి కిచెన్ పేరుతో రెస్టారెంట్ పెట్టి.. మంచి సక్సెస్ అందుకున్నారు నాగశౌర్య మదర్. అయితే నాగశౌర్య సొంత మేనత్త కూడా ఫేమస్ నటి అని మీకు తెల్సా..?.
టాలీవుడ్ లవర్ బాయ్స్ లిస్ట్ తీస్తే.. అందులో అందులో మొదటి వరసలో ఉంటాడు నాగశౌర్య. గర్ల్స్ శౌర్యాను బాగా లైక్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మంచిగా ఓన్ చేసుకుంటారు. కాకపోతే మాస్ ఇమేజ్ కోసం కొన్ని సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు నాగశౌర్య. ఈ హీరో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. వరసగా అరడజను ప్లాఫ్స్ పడేసరికి.. కంటెంట్ వైజ్ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చాన్నాళ్ల నుంచి సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంటున్నాడు శౌర్య. అతను అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన నారీ నారీ నడమ మురారీ, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల గురించి అప్డేట్స్ కూడా ఏం లేవు. అయితే నాగశార్య సొంత మేనత్త(తండ్రి సోదరి) తెలుగునాట ఫేమస్ నటి అని తెల్సా..? అవునండీ.. ఆమె చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె పేరు లత శ్రీ. ‘యమలీల’ చిత్రంలో ‘అభివందనం యమరాజా..’ అంటూ ఆడిపాడింది ఈమే. నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు, జంపలకిడి పంబ.. వంటి హిట్ సినిమాల్లో లత శ్రీ నటించారు. విభిన్న భాషల్లో కలిపి దాదాపు 70 సినిమాల్లో మెప్పించారు. జిమ్ ట్రైనర్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత.. 1999 నుంచి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు.
2007లో ఈవీవీ డైరెక్ట్ చేసిన ‘అత్తిలి సత్తిబాబు’ మూవీతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినా .. పెద్దగా సక్సెస్ మారలేదు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ బీటెక్ కంప్లీట్ చేశారు. అయితే నాగశౌర్య ఫ్యామిలీ తనను పట్టించుకోరని గతంలో పలుసార్లు లత శ్రీ చెప్పుకొచ్చారు. అన్నయ్య, మేనల్లుడు నా వాళ్లే.. కాని వదిన మన వాళ్లు అవ్వరు కదా అని ఆమె నాగశౌర్య తల్లితో ఉన్న గ్యాప్ గురించి చెప్పకనే చెప్పారు. తన మేనల్లుడు నాగశౌర్య అంటే ఇష్టమేనని.. అతని చేసిన సినిమాలు కూడా చూస్తానని లత శ్రీ వెల్లడించారు. ఇక నాగశౌర్య ఇంట జరిగిన వివిధ శుభకార్యాల్లో కూడా ఆమె కనిపించకపోవడం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి