Tollywood : ఈ చిన్నారులు ఇప్పుడు క్రేజీ హీరోయిన్లు.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న గ్లామరస్ భామలు.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్న చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు చిన్నారు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్లు అని మీకు తెలుసా.. ? ఒక్కోక్కరు భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దుమ్మురేపుతున్నారు. ఇంతకీ ఆ చిన్నారులను మీరు గుర్తుపట్టారా.. ? అయితే ఆ ముగ్గురు ఎవరు.. ఏఏ సినిమాల్లో నటించారో తెలుసుకోండి.

తెలుగు చిత్ర పరిశ్రమలో బాలనటులుగా అలరించి.. ఆ తర్వాత హీరోహీరోయిన్లుగా మారిన నటీమణులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వెండితెరపై చిన్నతనంలోనే తమ అమాయకమైన చూపులతో, క్యూట్ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఎందరో బాలనటీమణులు.. కాలక్రమేణా గ్లామరస్ అండ్ పవర్ ఫుల్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. చిన్ననాటి నటన ద్వారా సంపాదించుకున్న గుర్తింపు, ఆ తర్వాత వారి కెరీర్ విజయాలకు ఎంతో దోహదపడింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోనూ చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు అలరించారు. తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్, మహేంద్రన్… ఇలా ఎంతో మంది చిన్నారులు ఇప్పుడు నటీనటులుగా అలరిస్తుంటే మరికొందరు సినిమాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టిపెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతుంది. అందులో కనిపించిన చిన్నారులు ఇప్పుడు క్రేజీ హీరోయిన్లు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందామా.
ముందుగా పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు ఎవరో తెలుసుకుందామా. ముందుగా ఎడమ వైపు ఉన్న చిన్నారి పేరు యువిన పార్వతి. నిజానికి తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్. కానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2014లో వచ్చిన జై హింద్ సినిమాలో నటించి మెప్పించింది. అలాగేయాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో పార్వతి పాత్రలో కనిపించింది. తర్వాత కాకి అనే తెలుగు-తమిళ బైలింగ్యువల్ సినిమాలో నటించింది. అంతేకాకుండా తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. ఇప్పుడు కథానాయికగానూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు వెంకీ నటిస్తోన్న ఆదర్శ కుటుంబంలో నటిస్తుంది.
View this post on Instagram
అలాగే మధ్యలో ఉన్న అమ్మాయి పేరు రక్షణ. తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా విక్రమార్కుడు రీమేక్ సిరుత్తై చిత్రంలో కార్తి కూతురిగా కనిపించింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కథానాయికగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.
View this post on Instagram
ఇక చివరన ఉన్న అమ్మాయిని మీరు గుర్తుపట్టే ఉంటారు. ఆమె మరెవరో కాదు.. ధురంధర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సారా అర్జున్. పొన్నియన్ సెల్వన్ సినిమాతో చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది.
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..
