AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.500కి ఇంటికొచ్చిన కోతి.. ఇప్పుడు కోట్ల ఆస్తికి వారసురాలు!

పెంపుడు జంతువులపై ప్రేమ సహజం. కానీ, కొందరు వ్యక్తులు ఆ ప్రేమను మరో స్థాయికి తీసుకువెళ్తారు. అటువంటి విచిత్రమైన, మనసును కదిలించే ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక దంపతులు తమ పెంపుడు కోతి చున్మున్ పై ఉన్న అపారమైన ప్రేమతో, దాని సంరక్షణ కోసం తమ యావత్‌ ఆస్తులను ట్రస్ట్‌కు రాశారు. వారి అసాధారణ బంధం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రూ.500కి ఇంటికొచ్చిన కోతి.. ఇప్పుడు కోట్ల ఆస్తికి వారసురాలు!
Pet Monkey Chunmun
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2026 | 7:18 PM

Share

ఈ కథ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందినది. అది 2015వ సంవత్సరం. రాజేష్ శ్రీవాస్తవ హిందువు, షబిస్తా ముస్లిం. వారు మతపరమైన అడ్డంకులను అధిగమించి వివాహం చేసుకున్నప్పుడు, సమాజం, వారి సమీప కుటుంబాలు వారిని అంగీకరించడానికి నిరాకరించాయి. సామాజిక బహిష్కరణ కారణంగా, ఆ జంట సంవత్సరాల తరబడి ఒంటరితనాన్ని అనుభవించారు. ఈ ఒంటరితనాన్ని తగ్గించడానికి, 2005లో చుమ్మాన్‌ వారి జీవితంలోకి ప్రవేశించింది.

చున్‌మున్ ఒక చిన్న కోతిపిల్ల. సంతానం లేని ఈ దంపతులు 2005లో దానిని కేవలం 500 రూపాయలకు కొనుగోలు చేశారు. దాని తల్లి విద్యుత్ షాక్‌తో మరణించింది. రాజేష్, షబిస్తా ఈ అనాథ శిశువును దత్తత తీసుకుని తమ సొంత కొడుకులా పెంచుకున్నారు.. ఈ దంపతుల ప్రకారం, చున్మున్ వారి జీవితంలోకి వచ్చిన తర్వాతనే వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి వ్యాపారం వృద్ధి చెందింది.

ఇవి కూడా చదవండి

చున్మున్ వారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. దాని కోసం ఒక AC రూమ్ ఏర్పాటు చేశారు. చలి కోసం హీటర్ సౌకర్యం కూడా ఉంది. చున్మున్ ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. దానికి చైనీస్ వంటకాలు, టీ, మామిడి రసం అంటే ఇష్టం. ఈ దంపతులు చున్మున్ పుట్టినరోజులను కూడా జరుపుకుంటారు. వందలాది మందిని ఆహ్వానించి పార్టీలు నిర్వహిస్తారు. 2010లో, చున్మున్ కు బిట్టి అనే ఆడ కోతితో వివాహం జరిపించారు. దానిని కూడా తమ ఇంట్లోనే ఉంచుకున్నారు.

రాజేష్ శ్రీవాస్తవ, షబిస్త దంపతులు తాము చనిపోయిన తర్వాత చున్మున్, బిట్టి సంరక్షణ గురించి ఆందోళన చెందారు. కోతులు 35 నుండి 40 సంవత్సరాలు జీవించగలవు. కాబట్టి, వారు తమ ఆస్తులను దాని సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక ట్రస్ట్‌కు రాయాలని నిర్ణయించుకున్నారు. ఈ డబ్బు చున్మున్ సంరక్షణకే కాకుండా, రాయబరేలీ చుట్టుపక్కల అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల ఇబ్బందులు పడుతున్న ఇతర కోతుల సంక్షేమానికి కూడా వినియోగించబడుతుంది.

చున్మున్ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా, కోతుల కోసం నివాసాలను ఏర్పాటు చేయడం, వాటికి ఆహారం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టబడతారు. ఈ దంపతులు తమ పెంపుడు కోతిపై చూపిన ప్రేమ, వఫాదారీ, కోతుల సంక్షేమం కోసం వారి నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ