AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడి సముద్రంలో సాహసం.. 3 రోజుల పాటు బోల్తా పడిన పడవను పట్టుకుని బతికిపోయిన 15ఏళ్ల బాలుడు..

చలితో గడ్డకట్టుకుపోయే సముద్ర అలలు... శూన్యం కంటే తక్కువ ఉష్ణోగ్రత... ఆహారం, నీరు లేని పరిస్థితి... ఇలాంటి చోట కొన్ని గంటలు నిలబడటమే అసాధ్యం. కానీ, అలాస్కాలోని బెరింగ్ సముద్రంలో 15 ఏళ్ల బాలుడు తన మనోధైర్యంతో మృత్యువును జయించాడు. బోల్తా పడిన పడవను మూడు రోజుల పాటు గట్టిగా పట్టుకుని ఉండి, ప్రాణాలతో బయటపడిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

నడి సముద్రంలో సాహసం.. 3 రోజుల పాటు బోల్తా పడిన పడవను పట్టుకుని బతికిపోయిన 15ఏళ్ల బాలుడు..
Alaska Bering Sea Survival
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2026 | 5:25 PM

Share

అలాస్కాలోని గడ్డకట్టే బెరింగ్ సముద్రంలో పడవ బోల్తా పడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన 15 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు, కజిన్ ప్రాణాలు కోల్పోగా, ఆ బాలుడు బోల్తా పడిన పడవను గట్టిగా పట్టుకుని మూడు రోజుల పాటు ఆహారం, నీళ్లు లేకుండా గడిపాడు. ఇందుకు సంబంధించిన వార్త, ఈ రెస్క్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగింది?

అలాస్కాలోని సేంట్ లారెన్స్ ఐలాండ్ నుంచి ముగ్గురు సభ్యుల బృందం పడవలో ప్రయాణమైంది. ఆదివారం నాటికి వారు తిరిగి రావాల్సి ఉంది. అయితే మార్గమధ్యలో బెరింగ్ సముద్రంలో వీచిన ప్రతికూల గాలులకు వారి పడవ తలకిందులై బోల్తా పడింది. కుటుంబ సభ్యులకు వారి సమాచారం అందకపోవడంతో యుఎస్ కోస్ట్ గార్డ్‌కు ఫిర్యాదు చేశారు.

3 రోజుల మృత్యుపోరాటం:

పడవ బోల్తా పడటంతో బాలుడి సోదరుడు పడవ కింద చిక్కుకుపోగా, అతని కజిన్ అలల తాకిడికి కొట్టుకుపోయి మరణించారు. కానీ, ఈ 15 ఏళ్ల బాలుడు ఎలాగోలా బోల్తా పడిన పడవ పైభాగానికి చేరుకుని దానిని గట్టిగా పట్టుకున్నాడు. ఏ క్షణంలోనైనా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ, ఆ బాలుడు పిడికిలి బిగించి మూడు రోజుల పాటు ఆ చలిగాలుల్లోనే గడిపాడు.

ఇవి కూడా చదవండి

కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్:

సోమవారం ఉదయం యుఎస్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ద్వారా సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బోల్తా పడిన పడవపై పసుపు రంగు జాకెట్ ధరించి మోకాళ్లపై కూర్చున్న బాలుడిని ఎయిర్ క్రూ గుర్తించింది. వెంటనే సమీపంలో ఉన్న ద నార్త్‌వెస్ట్ ఎక్స్‌ప్లోరర్ అనే చేపల వేట పడవకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ బాలుడికి రోప్ లైఫ్ రాఫ్ట్ విసిరి, పడవపైకి సురక్షితంగా లాక్కుంది.

తీవ్ర హైపోథర్మియా:

బాలుడిని రక్షించే సమయానికి అతడు తీవ్రమైన చలికి గురై వణుకుతున్నాడు. రెస్క్యూ సిబ్బంది అతనికి వేడి దుప్పట్లు, హాట్ ప్యాక్స్ అందించి ప్రథమ చికిత్స అందించారు. తన కళ్ల ముందే సోదరులు ప్రాణాలు కోల్పోయిన బాధ ఉన్నప్పటికీ, ఆ బాలుడు ప్రదర్శించిన అసమాన ధైర్యం అందరినీ కంటతడి పెట్టించింది. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆ బాలుడి మనోధైర్యానికి జోహార్లు అర్పిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us