AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రద్దీ రోడ్లపై వింత దృశ్యం.. గుర్రం కాదు, మనిషి కాదు… రిక్షాను లాగుతున్న రోబోట్ డాగ్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ రంగాల్లో చైనా సాధిస్తున్న పురోగతి ప్రపంచాన్ని నిరంతరం ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఫ్యాక్టరీలు, వైద్యరంగం, హోటళ్లలో రోబోల వాడకం సాధారణమైపోయిన ఈ కాలంలో, చైనా నుంచి వచ్చిన ఒక వినూత్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. సాధారణంగా రిక్షాలను లాగడానికి మనుషులు లేదా గుర్రాలను ఉపయోగిస్తారు. అయితే చైనాలో ఒక రోబోట్ డాగ్ సాంప్రదాయ చేతి రిక్షాను లాగుతూ వీధుల్లో పరుగులు తీసింది.

రద్దీ రోడ్లపై వింత దృశ్యం.. గుర్రం కాదు, మనిషి కాదు... రిక్షాను లాగుతున్న రోబోట్ డాగ్!
Robot Dog, China Robot Dog
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2026 | 3:28 PM

Share

ఏఐ, రోబోటిక్స్ ప్రపంచంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చాయి. అనేక సందర్భాల్లో రోబోలు, ఏఐ మనుషులను కూడా అధిగమిస్తున్నాయి. రోబోటిక్స్‌లో జరుగుతున్న ఈ విప్లవం మధ్య, ఇటీవల చైనా నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ఆ వీడియోలో గుర్రపు బండి, లేదా రిక్షా వంటి వాహనాన్ని లాగుతున్నది మనిషి గానీ, గుర్రం గానీ కాదు, ఒక రోబో కుక్క సాంప్రదాయ చేతి రిక్షాను లాగుతోంది. ఆ రిక్షాపై కూర్చున్న ఒక యువకుడు ఆనందంగా సెల్ఫీలు తీసుకుంటున్నాడు.

China Now అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X హ్యాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో ఒక మెటాలిక్ రోబోట్ డాగ్ రిక్షా ముందు భాగానికి కట్టబడి రోడ్డుపై ముందుకు సాగుతోంది. దాని వెనుక ఉన్న రిక్షాలో ఒక యువకుడు హాయిగా కూర్చుని తన మొబైల్‌లో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నాడు. ఈ వీడియోకు ఇకపై రిక్షాలు లాగడానికి గుర్రాలు లేదా మనుషులు అవసరం లేదు, రోబోట్ కుక్కలు ఈ పనిని సమర్థవంతంగా చేయగలవు అనే క్యాప్షన్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వగానే నెటిజన్లు రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు. సాంకేతికతను ఇలా వాడటంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ, ఇది కేవలం సాంకేతికతను చూపిస్తూ జనాల దృష్టిని ఆకర్షించడానికి చేసిన ఒక ప్రచార విన్యాసం మాత్రమే. సాంప్రదాయ రిక్షాకు రోబోను జోడించడం వల్ల కొత్త ఉపయోగం ఏమీ లేదు అని పేర్కొన్నారు.

మరొక వినియోగదారు స్పందిస్తూ, చైనా వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికత ఉంది. అలాంటప్పుడు ఇలాంటి పురాతన పద్ధతుల్లో రోబోలను వాడటం ద్వారా చైనా వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తోంది అని అభిప్రాయపడ్డారు. యంత్రాలు మనుషుల రోజువారీ పనులను ఆక్రమించడం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని మరికొందరు సాంకేతిక విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఏది ఏమైనప్పటికీ, సాంకేతికత ఏ స్థాయికి చేరిందో చూపించడానికి ఈ రోబోట్ డాగ్ వీడియో ఒక నిదర్శనంగా నిలిచింది. ఒకపక్క విమర్శలు వస్తున్నప్పటికీ, వినోదం మరియు సాంకేతిక కలయికగా రూపొందిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చేతిలో స్మార్ట్‌‌ఫోన్ ఉన్నా తోడులేని జీవితం.. 35 శాతం యువత
చేతిలో స్మార్ట్‌‌ఫోన్ ఉన్నా తోడులేని జీవితం.. 35 శాతం యువత
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా
పెళ్లి పేరుతో AAP నేతనే బురిడీ కొట్టించిన మహిళ!
పెళ్లి పేరుతో AAP నేతనే బురిడీ కొట్టించిన మహిళ!
ఏపీ గృహ నిర్మాణంలో సరికొత్త విప్లవం.. రూ.2.50 లక్షలకే 90 ఏళ్లు
ఏపీ గృహ నిర్మాణంలో సరికొత్త విప్లవం.. రూ.2.50 లక్షలకే 90 ఏళ్లు
ఆవులు రోజూ ఎన్ని గంటలు నిద్రపోతాయి..? 99శాతం మందికి తెలియని..
ఆవులు రోజూ ఎన్ని గంటలు నిద్రపోతాయి..? 99శాతం మందికి తెలియని..
రవ్వలడ్డూలు మెత్తగా, మధురంగా ఉండాలా.. ఈ ట్రిక్ మీకోసమే
రవ్వలడ్డూలు మెత్తగా, మధురంగా ఉండాలా.. ఈ ట్రిక్ మీకోసమే
JBL నుంచి అదిరిపోయే PartyBox స్పీకర్లు.. పవర్‌ఫుల్ సౌండ్‌తో..
JBL నుంచి అదిరిపోయే PartyBox స్పీకర్లు.. పవర్‌ఫుల్ సౌండ్‌తో..
అద్దె ఇంటికి మారుతున్నారా? ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి.. లేదంటే
అద్దె ఇంటికి మారుతున్నారా? ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి.. లేదంటే
రాసిపెట్టుకోండి.. ఈ ఏడాది చివరికల్లా వీరికి అనూహ్య పురోగతి
రాసిపెట్టుకోండి.. ఈ ఏడాది చివరికల్లా వీరికి అనూహ్య పురోగతి
మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్.. కీలక నిర్ణయాలు
మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్.. కీలక నిర్ణయాలు