Payal Ghosh: నేను చస్తే గానీ అతనిపై చర్యలు తీసుకోరా?.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి..

‘మీ టూ’ ఉద్యమం.. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా మొత్తం సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. నేను కూడా బాధితురాలినే అంటూ ఎంతో మంది ప్రముఖ

Payal Ghosh: నేను చస్తే గానీ అతనిపై చర్యలు తీసుకోరా?.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి..

Updated on: Dec 22, 2020 | 5:37 AM

Payal Ghosh: ‘మీ టూ’ ఉద్యమం.. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా మొత్తం సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. నేను కూడా బాధితురాలినే అంటూ ఎంతో మంది ప్రముఖ నటీమణులు తాము ఎదుర్కొన్న అనుభవాలను బహిర్గత పరిచారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అనురాగ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. నాలుగు నెలల క్రితం ఇది పెను దుమారమే రేపింది.

అయితే తాజాగా మళ్లీ ఈ వివాదాన్ని పాయల్ ఘోష్ తెరపైకి తచ్చింది. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది. అయినప్పటికీ అనురాగ్ కశ్యప్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్విటర్ వేదికగా స్పందించిన పాయల్.. ‘నేను చనిపోతే గానీ ఈ కేసు ముందుకు కదలదా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు విచారణ సరిగా చేయడం లేదు. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇది ఒక మహిళకు సంబంధించిన విషయం’ అంటూ పాయల్ ట్వీట్ చేసింది. మరి పోలీసులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.

Payal Ghosh Tweet: