పాతికేళ్ల శంకర్ ప్రస్థానం..ఒక్కటైన దర్శక లోకం

డైరక్టర్ శంకర్…సౌత్ ఫిల్మ్ స్టామినాను ప్రపంచానికి చాటిన వ్యక్తి. పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ ఆయన సినిమాలోనే కనిపిస్తాయి. అదే సమయంలో కమర్షియల్ అంశాలతోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. 90వ దశకంలో గ్రాఫిక్స్ ను ఇండియన్ తెరపై ఆవిష్కరించి సంచలనాలకు నెలవుగా మారాడు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. ఎక్కడో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పుట్టిన శంకర్‌ అనే ఒక సాధారణ యువకుడు ఇప్పుడు ప్రపంచ సినిమా తిరిగి చూసే […]

పాతికేళ్ల శంకర్ ప్రస్థానం..ఒక్కటైన దర్శక లోకం
Follow us

|

Updated on: Apr 22, 2019 | 4:42 PM

డైరక్టర్ శంకర్…సౌత్ ఫిల్మ్ స్టామినాను ప్రపంచానికి చాటిన వ్యక్తి. పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ ఆయన సినిమాలోనే కనిపిస్తాయి. అదే సమయంలో కమర్షియల్ అంశాలతోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. 90వ దశకంలో గ్రాఫిక్స్ ను ఇండియన్ తెరపై ఆవిష్కరించి సంచలనాలకు నెలవుగా మారాడు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. ఎక్కడో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పుట్టిన శంకర్‌ అనే ఒక సాధారణ యువకుడు ఇప్పుడు ప్రపంచ సినిమా తిరిగి చూసే స్థాయికి ఎదిగారు. 25 ఏళ్ల క్రితం నటుడవ్వాలన్న కలతో చెన్నైనగరానికి చేరిన శంకర్‌ చిన్న చిన్న వేషాలు వేసినా, ఆయన్ని డెస్టిని దర్శకత్వం వైపు పరుగులు తీయించింది. అంతే అప్పటికే ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ వద్ద శిష్యుడిగా చేరిపోయారు. అలా కొన్నేళ్లు ఆయన వద్ద పని చేసి జంటిల్‌మెన్‌ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టారు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవాతో ప్రేమికుడు తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, స్నేహితుడు,  రోబో, ఐ, ఇలా వరుసగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మెగా మూవీలను అందించాడు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన 2.ఓ చిత్రంతో హాలీవుడ్‌ చిత్రాలకు ఏ మాత్రం సౌత్ సినిమాలు తగ్గవని ప్రూవ్ చేశాడు. కాగా శంకర్‌ సినీ పయనం 25 ఏళ్లకు చేరుకుంది.  ఆదివారం ఉదయం దర్శకుడు మిష్కన్‌ కార్యాలయంలో  శంకర్‌ తన శిష్యులు వసంతబాలన్, బాలాజీశక్తివేల్, అట్లీలతో కలిసి సరదాగా గడిపారు. కాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం, గౌతమ్‌మీనన్, లింగుసామి, శశి, పా.రంజిత్, పాండిరాజ్, మోహన్‌రాజా కూడా శంకర్‌ ఆనందంలో పాలు పంచుకున్నారు.

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్