Shanker Daughter: టాప్ డైరెక్ట‌ర్ ఇంట పెళ్లి సంద‌డి.. క్రికెట‌ర్‌ను వివాహ‌మాడ‌నున్న శంక‌ర్ కూతురు.. ఎవ‌రితో తెలుసా?

|

Jun 26, 2021 | 7:54 PM

Shanker Daughter Marriage: విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇంట పెళ్లి సంద‌డి మొద‌లు కానుంది. శంక‌ర్ పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు ప్రీమియం లీగ్ (టీఎన్‌పీల్‌) జ‌ట్టుకు చెందిన..

Shanker Daughter: టాప్ డైరెక్ట‌ర్ ఇంట పెళ్లి సంద‌డి.. క్రికెట‌ర్‌ను వివాహ‌మాడ‌నున్న శంక‌ర్ కూతురు.. ఎవ‌రితో తెలుసా?
Shanker Daughter Marriage
Follow us on

Shanker Daughter Marriage: విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇంట పెళ్లి సంద‌డి మొద‌లు కానుంది. శంక‌ర్ పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు ప్రీమియం లీగ్ (టీఎన్‌పీల్‌) జ‌ట్టుకు చెందిన క్రికెట‌ర్ రోహిత్ దామోద‌ర్‌ను ఐశ్వ‌ర్య మ‌నువాడ‌నుంది. ఇటీవ‌లే రోహిత్‌తో ఆమెకు ఎంగెంజ్‌మెంట్ జ‌రిగింది. త్వ‌ర‌లోనే వివాహ తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

ఇదిలా ఉంటే నిజానికి వివాహాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించాల‌ని భావించినా క‌రోనా కార‌ణంగా నిరాడంబ‌రంగా చేయాల‌ని కుటుంబ‌స‌భ్యులు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ స‌భ్యులు, కొద్ది మంది బంధువుల స‌మ‌క్షంలో వివాహాన్ని నిర్వ‌హించాల‌ని నిశ్చ‌యించుకున్నార‌ని స‌మాచారం. ఇక శంక‌ర్ కూతురు ఐశ్వ‌ర్య విష‌యానికొస్తే.. ఆమె డాక్ట‌ర్ వృత్తిని కొన‌సాగిస్తోంది. రోహిత్ విష‌యానికొస్తే టీఎన్‌పీఎల్‌లో క్రికెట‌ర్‌. రోహిత్ తండ్రి రామోద‌ర్ త‌మిళ‌నాడులో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌. ఈయ‌న మధురై పాంథర్స్‌ టీంకు స్పాన్సర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కూడా. శంక‌ర్ కెరీర్ విష‌యానికొస్తే ఈ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ప్యాన్ ఇండియా సినిమా తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. అంత‌కుముందు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా ఇండియ‌న్‌-2ను ప్రారంభించిన శంక‌ర్.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

Also Read: Monal Gajjar: ఓ ఇంటిది అయిన బిగ్‌బాస్ బ్యూటీ.. తాను ఇప్పుడు అధికారికంగా హైద‌రాబాదీ అంటూ ఆస‌క్తిక‌ర పోస్ట్.

Kannada Actor Chetan Kumar: కర్ణాటక మినిష్టర్ పై ఒక రూపాయికి పరువు నష్టం దావా వేసిన కన్నడ హీరో చేతన్..

Aha: ఆహా అందిస్తున్న మరో ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్.. అమలపాల్ ప్రధాన పాత్రలో ‘కుడి ఎడమైతే’..