Rajamouli: చిరంజీవి కాదన్నా ఇండస్ట్రీకి ఆయనే పెద్ద.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajamouli: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ సినీ ప్రముఖులు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి..

Rajamouli: చిరంజీవి కాదన్నా ఇండస్ట్రీకి ఆయనే పెద్ద.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..
Rajamouli Chiranjeevi

Updated on: Feb 10, 2022 | 5:24 PM

Rajamouli: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ సినీ ప్రముఖులు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చిరంజీవినే పెద్ద అని తేల్చి చెప్పారు రాజమౌళి.

సీఎంతో భేటీ పూర్తయ్యాక రాజమౌళి మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌ ఓపికగా విన్నారు. సినిమా వాల్ల కష్టాల గురించి ముఖ్యమంత్రి గారికి చాలా అవగాహన ఉంది. ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చిరంజీవి గారికి పెద్ద అంటే ఇష్టం ఉండదు. కానీ అతని చర్యలతో ఇండస్ట్రీ పెద్ద ఆయనే అని చాటిచెప్పారు.

ముఖ్యమంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని వినియోగించి ఇంత పెద్ద సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేశారు. కొన్ని నెలలుగా అసలు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటన్న పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి గారు ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకువెళుతున్నందుకు చిరంజీవి గారికి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.

Also Read: Hyderabad News: ఈ కేటుగాళ్లు మహా డేంజర్.. నిమ్మిన వారిని నట్టేట ముంచారు.. మరి పోలీసులు ఊరుకుంటారా?, ఇదిగో ఇలా..

Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు..

CM Jagan-Tollywood: రోజంతా 5షోలకు పర్మిషన్..! పరస్పర ప్రయోజనాలు.. సారాంశం ఇదే