The Ghost: ఘోస్ట్‌.. క్లాస్‌గా తీసిన పక్కా మాస్‌ మూవీ, థియేటర్లలో రచ్చ రచ్చే.. ప్రవీణ్‌ సత్తారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

|

Oct 01, 2022 | 9:07 PM

నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ది ఘోస్ట్‌'. గరుడవేగ వంటి సూపర్ హిట్‌తో స్టైలిష్‌ డైరకెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అక్టోబర్‌ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమాపై...

The Ghost: ఘోస్ట్‌.. క్లాస్‌గా తీసిన పక్కా మాస్‌ మూవీ, థియేటర్లలో రచ్చ రచ్చే.. ప్రవీణ్‌ సత్తారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
The Ghost Movie
Follow us on

నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. గరుడవేగ వంటి సూపర్ హిట్‌తో స్టైలిష్‌ డైరకెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అక్టోబర్‌ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు శనివారం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ది ఘోస్ట్‌ చూడడానికి క్లాస్‌ చిత్రంగా కనిపిస్తున్నా, ఇది పక్కా మాస్‌ మూవీ అని చెప్పుకొచ్చారు. సినిమాలో చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయని.. థియేటర్లో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు తెలిపారు. సినిమాకు ఇదే టైటిల్‌ పెట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం. రా, ఇంటెలిజెన్స్ ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ వుంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో కథానాయకుడి కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టినపేరు ఘోస్ట్’ అని వివరించాడు. ఇక హీరో నాగార్జున గురించి మాట్లాడుతూ.. ‘నాగార్జున గారంటే నా మనసులో ఒక ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. ఆ రకంగా వెండితెరపై చూపించాలని కథ రాసుకున్నాను. నా కెరీర్‌లో హీరోకి కథ రాయడం ఇదే తొలిసారి. ఆయన ఇంటెన్సిటీ, స్టయిల్, గ్రేస్ ఉపయోగించుకొని , ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో ఆ విధంగా డిజైన్ చేశాను. తక్కువగా మాట్లాడి బలమైన యాక్షన్స్ తో ఇంపాక్ట్ చూపే విధంగా ఉంటుంది. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. ప్రతి యాక్షన్ సీన్ వెనుక బలమైన ఎమోషన్ వుంటుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇక ‘ది ఘోస్ట్ విడుదలవుతోన్న రోజే గాడ్ ఫాదర్ విడుదలౌతుంది కదా ? పోటీ ఎలా వుండబోతుందని భావిస్తున్నారు ?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇందులో పోటీ లేదు. రెండు భిన్నమైన సినిమాలు. బావున్న ప్రతి సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారని నమ్ముతాను’ అని తెలిపారు దర్శకుడు. ఇక ప్రవీన్‌ సత్తారు తర్వాతి చిత్రం వరుణ్‌ తేజ్‌తో నిర్మించనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి యూకేలో ఈసినిమా షూటింగ్ మొదలు కానుంది. అలాగే ఒక వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. మరి ఘోస్ట్‌ మూవీ ప్రవీణ్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..