Raja Saab: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ మారుతీ.. ఓదార్చిన ప్రభాస్.. ఏం జరిగిందంటే..
ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

డైరెక్టర్ మారుతీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా కాలం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. హార్రర్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఈ సినిమాతో మాళవిక మోహనన్ తెలుగు తెరకు పరిచయం కాబోతుండగా.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ సైతం ప్రభాస్ జోడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. డిసెంబర్ 27న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
రాజాసాబ్ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఒక్క శాతం నిరాశ కలిగించినా తన ఇంటికి రమ్మని అడ్రస్ సైతం ఇచ్చారు. ‘ప్రభాస్ ను ప్రేమించే ఏ ఒక్కరు అయినా సరే మిమ్మల్ని డిజప్పాయింట్ చేశావ్ అని ఫీల్ అయితే విల్లా నంబర్ 16 కొండాపూర్ ఏరియాలోని కొల్ల లగ్జోరియాకు రండి’ అని అన్నారు. ఈ క్రమంలోనే రాజాసాబ్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ మారుతీ ఎమోషనల్ అయ్యారు. తాను చావులకు వెళ్లిన సమయంలోనూ కన్నీళ్లు పెట్టుకోనని.. ఇదంతా సహజం అనుకుంటానని.. కానీ మూడేళ్ల నుంచి తనలో ఉన్న స్ట్రెస్ ఈ రూపంలో బయటకు వచ్చిందని అన్నారు.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
డైరెక్టర్ మారుతి ఎమోషనల్ కావడంతో స్టేజ్ పైకి వెళ్లి ఓదార్చారు ప్రభాస్. ఈ సన్నివేశం అక్కడే ఉన్న ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. మూడేళ్ల క్రితం ముంబైలో ఆదిపురుష్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను అక్కడకు వెళ్లానని.. అప్పుడు ప్రభాస్ రాముడి గెటప్ లో ఉన్నారని.. తనతో సినిమా చేసే అవకాశం ఈ మారుతికి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు డైరెక్టర్. 11 సినిమాలు చేసిన తనను ప్రభాస్ రెబల్ యూనివర్సిటీకి తీసుకెళ్లారని అన్నారు.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
When the whole world doubts you, yet one friend sees you, trusts you, and believes in you 🥺 #Prabhas #TheRajaSaab pic.twitter.com/TaMQk4oZtl
— Sagar (@SagarPrabhas141) December 27, 2025
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
