Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ను కలిసిన దర్శకుడు హరీశ్‌ శంకర్‌.. ప్రమాదం తర్వాత తేజ్ తొలి ఫోటో.!

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాద వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజు హైదరాబాద్‌ ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌..

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ను కలిసిన దర్శకుడు హరీశ్‌ శంకర్‌.. ప్రమాదం తర్వాత తేజ్ తొలి ఫోటో.!
Sai Dharam Tej

Updated on: Oct 21, 2021 | 11:44 AM

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాద వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజు హైదరాబాద్‌ ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో తీవ్రంగా గాయపడ్డ తేజ్‌ సుమారు నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యుల సూచన మేరకు డిశ్చార్చ్‌ అయ్యారు. ఈ క్రమంలోనే తేజ్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్‌ ఆసుపత్రిలో ఉండగానే ఆయన కొత్త చిత్రం ‘రిపబ్లిక్‌’ విడుదలైంది. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇంతవరకు తేజ్‌ ప్రేక్షకులకు కనిపించలేదు. కనీసం ఆయన ఫోటో కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయలేదు.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు హరీష్‌ శంకర్‌, తేజ్‌ను కలుసుకున్నారు. బుధవారం రాత్రి ఇంటికి వెళ్లి తేజ్‌ను కలుసుకున్న హరీష్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. తేజ్‌ చేతిలో చేతి వేసిన ఫోటోను పోస్ట్‌ చేసిన హరీష్‌.. ‘నా సోదరుడు సాయి ధరమ్‌ తేజ్‌ను కలిశాను. ఇద్దరి మధ్య మంచి సంబాషణ జరిగింది. ఆయన సూపర్‌ ఫిట్‌గా ఉన్నాడని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్.. అనే క్యాప్షన్‌ జోడించారు.

ఇదిలా ఉంటే హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకొని తేజ్‌ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌ల్లో ఒకటిగా నిలిచింది. దీంతో తేజ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో కెమెరా ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడుతాడని ఎదురు చూస్తున్నారు.

Also Read: 100 Crore Vaccination: 100 కోట్ల మార్కును దాటిందోచ్.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..

Viral Video: గున్న ఏనుగును రక్షించుకునేందుకు నీటి కొలనులో మొసలితో తలపడిన ఏనుగు.. చివరకు గెలిచిందెవో ఊహింగలరా?

పంజాబీ భాంగ్రా పాట‌కు స్టెప్పులు.. రావణుడి ఫన్నీ డాన్స్ వీడియో వైర‌ల్‌!