యంగ్ హీరో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం :”ఎఫ్3″ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో తమన్నా, మెహరీన్లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. అంతే వేగంతో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన ట్విట్టర్లో “సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశాం. మూడో షెడ్యూల్ స్టార్ట్ కాగానే మరిన్ని అప్డేట్స్ ఇస్తాం” అని ట్వీట్ చేశాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ మూవీని ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. గతంలో వీరి ముగ్గురి కాంబోలో తెరకెక్కిన “ఎఫ్ 2” సినిమా కామెడీ సక్సెస్ ఫుల్గా నిలిచింది. దీంతో ఆ సినిమాకు సిక్వెల్గా ఎఫ్3ని తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి.
We are done with our 2nd schedule. Can’t wait to get back on sets to enjoy the fun. Will be back with more updates when 3rd schedule kick-starts. #F3Movie#F3onAug27th @Venkymama @IamVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP@SVC_official #F3 pic.twitter.com/l4xLl20naY
— Anil Ravipudi (@AnilRavipudi) February 17, 2021
Also Read: వరుసగా ఐదు సినిమాలు హిట్.. విజయ పరంపరలో అనిల్ రావిపూడి..