Dil Raju: దిల్‌ రాజు, తేజస్వీనిల ప్రేమ కథ.. సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. ఆసక్తిర విషయాలు పంచుకున్న స్టార్‌ ప్రొడ్యూసర్.

|

Jan 16, 2023 | 10:04 AM

దిల్‌ రాజు పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోలకు సమానమైన క్రేజ్‌ను దక్కించుకున్న అతి కొద్ది మంది నిర్మాతాల్లో దిల్‌ రాజు ఒకరు. ఒకరకంగా చెప్పాలంటే ఏకైక వ్యక్తి కూడా దిల్‌రాజే అనడంలో సందేహం లేదు. ఎన్నో భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన..

Dil Raju: దిల్‌ రాజు, తేజస్వీనిల ప్రేమ కథ.. సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. ఆసక్తిర విషయాలు పంచుకున్న స్టార్‌ ప్రొడ్యూసర్.
Dil Raju
Follow us on

దిల్‌ రాజు పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోలకు సమానమైన క్రేజ్‌ను దక్కించుకున్న అతి కొద్ది మంది నిర్మాతాల్లో దిల్‌ రాజు ఒకరు. ఒకరకంగా చెప్పాలంటే ఏకైక వ్యక్తి కూడా దిల్‌రాజే అనడంలో సందేహం లేదు. ఎన్నో భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్‌ రాజు టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇక దిల్‌ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. అయితే మూడేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన దిల్‌ రాజు ఆ తర్వాత తేజస్వినిని వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ జంట ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు.

ఇదిలా ఉంటే దిల్‌ రాజు కేవలం సినిమాలకు సంబంధించి తప్ప వ్యక్తిగత జీవిత విషయాలను పెద్దగా పంచుకోరు. చివరికి ఇంటర్వ్యూల్లో కూడా కేవలం సినిమాలు, ఇండస్ట్రీ గురించే మాట్లాడుతుంటారు. అయితే తాజాగా మొట్టమొదటి సారి దిల్‌ రాజు తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలోకి తేజస్విని ఎలా వచ్చారు.? ఆ పరిచయం వివాహానికి ఎలా దారి తీసిందన్న వివరాలను వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా దిల్‌రాజు, తేజస్విని టీవీ9కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తేజస్వినితో పాటు దిల్‌ రాజు తమ వివాహానికి సంబంధించి తొలిసారి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

దిల్‌రాజు తేజస్విని ఎలా కలిశారన్న విషయాలను తెలుపుతూ.. ‘నా మొదటి భార్య అనిత మరణించిన తర్వాత రెండేళ్లు చాలా కష్టాన్ని అనుభవించాను. నేను అప్పటికే 47 ఏళ్లు ఉన్నాయి. జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలి అనుకుంటున్న సమయంలో రెండు, మూడు ఆప్షన్స్‌ ఉన్నాయి. కానీ నా బిజీ లైఫ్‌ కారణంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకున్నాను. అదే సమయంలో నేను విమానంలో ప్రయాణం చేసే సమయంలో తెజస్విని పరిచయం అయ్యింది. ఫోన్‌ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ జర్నీ తర్వాత ప్రపోజ్‌ చేయడం, ఆ తర్వాత ఫ్యామిలీతో చర్చలు. చివరికి వివాహం వరకు వెళ్లింది’ అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు. ఇక తేజస్వినిలో తనకు నచ్చింది తను.. గ్రౌండ్ టు ఎర్త్‌ కావడమే అని తెలిపారు. ఇక దిల్‌రాజు తనకు ఎలా పరిచయమయ్యారన్న విషయాన్ని తేజస్విని చెబుతూ.. ‘నేను ఎయిర్‌ లైన్స్‌లో పనిచేస్తున్న సమయంలో, ఈయన రెగ్యులర్‌గా ట్రావెల్‌ చేసేవారు. మొదటిసారి నన్ను కలిసినప్పుడు పన్‌ అడిగారు. నేను షిఫ్ట్‌లో ఉన్న ప్రతీసారి విమానంలో కనిపించేవారు’ అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

దిల్‌రాజు, తేజస్వినిల పూర్తి ఇంటర్వ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..