
బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలనుకుంటున్న టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఇక్కడి సినిమాలకు అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నాని ‘జెర్సీ’ని హిందీలో షాహిద్ కపూర్‌తో రీమేక్ చేస్తోన్న దిల్ రాజు.. మరిన్ని సినిమాలను తన లిస్ట్‌లో పెట్టుకున్నారు. వాటిలో ఎఫ్ 2, ఎవడు చిత్రాలు ఉన్నాయి. ఎఫ్ 2 రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు బాలీవుడ్‌లో జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మరో తెలుగు చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ఆయన రెడీ అయినట్లు తెలుస్తోంది.
తెలుగులో విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీని దిల్ రాజు హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి నానిని సంప్రదించి రీమేక్ హక్కులు తీసుకుంటున్నట్లు కూడా టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా థ్రిల్లర్ కథాంశంతో హిట్ మూవీ తెరకెక్కింది. ఫిబ్రవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది.
Read This Story Also: ఆ కారణంతో నితిన్‌తో మూవీని రిజెక్ట్ చేసిన నాని హీరోయిన్లు..!