Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

ఆ కారణంతో నితిన్‌తో మూవీని రిజెక్ట్ చేసిన నాని హీరోయిన్లు..!

హిందీలో ఘన విజయం సాధించిన 'అంధాధూన్‌'ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
Nithiin Andhadhun remake, ఆ కారణంతో నితిన్‌తో మూవీని రిజెక్ట్ చేసిన నాని హీరోయిన్లు..!

హిందీలో ఘన విజయం సాధించిన ‘అంధాధూన్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు గానూ కీర్తి సురేష్‌, ప్రియాంక మోహన్‌ ల పేర్లను పరిశీలిస్తున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ఇద్దరు ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దానికి కారణం ఇందులో లిప్‌లాక్‌లు ఉండటమేనని టాక్‌. కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి కీర్తి సురేష్‌ లిప్‌లాక్‌లకు దూరంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. అందుకే ఈ రీమేక్‌కు మహానటి నో చెప్పినట్లు సమాచారం. మరోవైపు ‘గ్యాంగ్ లీడర్’‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక కూడా లిప్‌లాక్‌ విషయంలో కొన్ని కండీషన్లు పెట్టుకుందట. అందుకే ఆమె కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు టాక్‌.

కాగా హిందీ ‘అంధాధూన్’‌లో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించగా.. టబు, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించారు. ఇక తెలుగులో టబు పాత్రకు గానూ ఆమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ‘అంధాధూన్’‌లో ఎవరెవరు నటించబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఈ ఏడాది భీష్మతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న నితిన్.. ప్రస్తుతం రంగ్‌దే చిత్రంతో పాటు చంద్రశేఖర్‌ యేలేటీ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు. రంగ్‌దేలో నితిన్‌ సరసన కీర్తి సురేష్‌ నటిస్తుండగా.. చంద్రశేఖర్ యేలేటీ మూవీలో రకుల్, ప్రియా వారియర్‌లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.

Read This Story Also: టీటీడీ భూముల అమ్మక తీర్మానంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Related Tags