Crazy: టాలీవుడ్‌లో రూ.50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో! ఎందుకో మరి
సౌత్ సినిమా ఇండస్ట్రీలో భారీగా పెరుగుతున్న హీరోల రెమ్యునరేషన్లు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా పాన్ఇండియా స్టార్స్, తమిళ, తెలుగు పరిశ్రమలో రెమ్యునరేషన్లు ఎంత పెరుగుతున్నాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కోలీవుడ్‌లో ఒక్క సినిమాకు సుమారు 35 కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో, టాలీవుడ్ ..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో భారీగా పెరుగుతున్న హీరోల రెమ్యునరేషన్లు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా పాన్ఇండియా స్టార్స్, తమిళ, తెలుగు పరిశ్రమలో రెమ్యునరేషన్లు ఎంత పెరుగుతున్నాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కోలీవుడ్‌లో ఒక్క సినిమాకు సుమారు 35 కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో, టాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు మాత్రం 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఈ వార్త ఒక్కసారిగా నెటిజన్స్ మధ్య వివాదాన్ని రేపింది. ఎవరు ఈ హీరో? ఎందుకు ఇంత డిమాండ్?
తాజా వార్తల ప్రకారం, ఒక ప్రముఖ తెలుగు డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెన్నైలో ఈ హీరోను కలిసి, కొత్త స్క్రిప్ట్ వివరించారట. స్టోరీకి ఆయన కూడా ఓకే చెప్పారట, కానీ రెమ్యునరేషన్‌గా 50 కోట్లు డిమాండ్ చేశారట. కోలీవుడ్‌లో ఒక్కో సినిమాకు 35 కోట్లు తీసుకుంటున్న ఈ హీరో, టాలీవుడ్‌కి మాత్రం ఎందుకంత డిమాండ్ చేస్తున్నాడని నెట్టింట చర్చ మొదలైంది. ఈ వార్త వైరలవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. కోలీవుడ్ స్టార్ ధనుష్! ‘సర్’తో టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ధనుష్, ఇప్పుడు పాన్ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ తెలుగు ప్రాజెక్ట్, ధనుష్‌కు మరో మైలురాయిగా మారబోతుందని అంచనా.
ధనుష్ కెరీర్ ప్రస్తుతం పీక్‌లో ఉంది. తన డైరెక్షన్‌లోనే నటించిన తమిళ సినిమా ఇడ్లీ కడై (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’) అక్టోబర్ 1న విడుదలైంది. ఈ చిత్రం అత్యుత్తమ రివ్యూస్ సంపాదించింది. ధనుష్ యాక్టింగ్, డైరెక్షన్ స్కిల్స్‌కు ప్రశంసల వర్షం కురిసింది. కమర్షియల్‌గా మాత్రం మోడరేట్ సక్సెస్ మాత్రమే, కానీ ధనుష్ మల్టీటాలెంటెడ్ ఇమేజ్‌ను మరింత బలపరిచింది.

Dhanush
తెలుగులో ధనుష్ ఇటీవల కుబేరతో మరో భారీ హిట్ ఇచ్చాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ పాన్ఇండియా ఫిల్మ్, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. వరుస హిట్లు ధనుష్‌కు తెలుగు మార్కెట్‌లో బలమైన బేస్‌ను ఇచ్చాయి, కానీ వాటివల్లే రెమ్యునరేషన్ పెరగడం వివాదానికి కారణమవుతోంది!




