‘ప్రస్థానం’ డైరెక్టర్‌తో సుప్రీమ్ హీరో!

|

Jun 24, 2019 | 9:10 AM

‘ప్రస్థానం’ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ దేవ కట్టా. ప్రస్తుతం ఆయన సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక తెలుగులో సినిమా చేయాలనుకున్న దేవ కట్టా.. సుప్రీమ్ హీరోని లాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం దేవ కట్టా చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో కొత్త […]

ప్రస్థానం డైరెక్టర్‌తో సుప్రీమ్ హీరో!
Follow us on

‘ప్రస్థానం’ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ దేవ కట్టా. ప్రస్తుతం ఆయన సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక తెలుగులో సినిమా చేయాలనుకున్న దేవ కట్టా.. సుప్రీమ్ హీరోని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం దేవ కట్టా చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో కొత్త సినిమా స్టార్ట్ చేయనున్న తేజ్.. ఈ సినిమా పూర్తవ్వగానే దేవ కట్టా సినిమాను స్టార్ట్ చేస్తాడట. ఈలోపు దేవ కట్టా కూడా ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌ను పూర్తి చేస్తాడని వినికిడి. మరి సాయితేజ్‌తో తీయబోయే సినిమాలో దేవ కట్టా ఎలాంటి స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తాడో చూడాలి.