Ahimsa Movie: హింసతో కూడిన ‘అహింస’.. దగ్గుబాటి హీరో కొత్త సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా.?

|

Sep 10, 2022 | 6:05 AM

Ahimsa Movie: దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమవుతోన్న కొత్త హీరో అభిరామ్‌. రానా తమ్ముడు అయిన అభిరామ్‌ ఇప్పటికే వెండి తెర ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు...

Ahimsa Movie: హింసతో కూడిన అహింస.. దగ్గుబాటి హీరో కొత్త సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా.?
Ahimsa First Glimps
Follow us on

Ahimsa Movie: దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమవుతోన్న కొత్త హీరో అభిరామ్‌. రానా (Rana) తమ్ముడు అయిన అభిరామ్‌ ఇప్పటికే వెండి తెర ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు తేజ దర్శకత్వంలో అభిరామ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి ముహూర్తం ఖరారు అయ్యింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజ, అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాగా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. గ్లింప్స్‌లో హీరోను కొందరు అడవిలో తీసుకెళ్తుండగా అతను తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతన్ని పట్టుకొని లాక్కొచ్చి కొడతుంటారు.

టీజర్‌ లో అసలు మ్యాటర్‌ ఏంటో కూడా చెప్పని తేజ సినిమా మాత్రం పక్కా వయలెన్స్‌తో కూడిన కథాంశమని చెప్పకనే చెప్పాడు. ఇక ఓవైపు టైటిల్‌ అహింస అని ఉండగా గ్లింప్స్‌లో మాత్రం హింసతో కూడిన సన్నివేశాలు ఉండడం ఆసక్తిని పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అభిరామ్‌కు జోడిగా గీతికా తివారి నటిస్తోంది. మరి ఈ సినిమా అభిరామ్‌కు ఎలాంటి లాంచింగ్ అవుతుందో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..