Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్ష కోసమై గురువారం నాడు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ చికిత్సలో భాగంగానే ఆస్పత్రిలో చేరినట్లు రజనీకాంత్ సన్నిహితులు తెలిపారు. కాగా, భారతీయ సినిమా అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న కొన్ని రోజుల్లోనే ఆయన ఆస్పత్రిలో చేరడంతో.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, సూపర్ స్టార్ రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని, హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరారని లతా రజనీకాంత్ తెలిపారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం ఒక రోజు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని చెప్పారు. కాగా, దీనికి ముందు రోజు కుమార్తె సౌందర్య కొత్తగా ప్రారంభించిన యాప్‌లో రజనీ వాయిస్ నోట్‌ను షేర్ చేశారు. అందులో రాబోయే దీపావళి పర్వదినం వేల విడుదల కానున్న తన అన్నాత్తై సినిమాను మనవడు వేద్ కృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి చూస్తానంటూ మాట్లాడారు.
Also read:
Superstar Rajinikanth: ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణమదేనంటున్న సన్నిహితులు..
Dinesh Karthik: అభిమానులకు ‘డబుల్’ ధమాకా న్యూస్ చెప్పిన దినేష్ కార్తీక్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..