RGV vs VH: కొనసాగుతోన్న ఆర్జీవీ వర్సెస్‌ వీహెచ్‌ వ్యహారం.. వర్మ ట్వీట్‌పై రియాక్ట్‌ అయిన కాంగ్రెస్‌ లీడర్‌

|

Mar 19, 2023 | 12:10 PM

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వర్మ చేసిన కామెంట్స్‌...

RGV vs VH: కొనసాగుతోన్న ఆర్జీవీ వర్సెస్‌ వీహెచ్‌ వ్యహారం.. వర్మ ట్వీట్‌పై రియాక్ట్‌ అయిన కాంగ్రెస్‌ లీడర్‌
Rgv Vs Vh
Follow us on

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వర్మ చేసిన కామెంట్స్‌ పలువరు రాజకీయ నాయకులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు వీ హనుమంత రావు కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించారు. సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన లేదని.. ఇలానే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీ అవుతుందని చెప్పారు. వర్మకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయండని వీహెచ్ సవాలు విసిరారు. నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేసి, వర్మ మీద చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు.

అయితే వీహెచ్‌ చేసిన వ్యాఖ్యలపై వర్మ సైతం తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా సెటైరికల్‌ ట్వీట్ చేశారు. ‘తాత గారూ మీరింకా ఉన్నారా అంటూ ట్వీట్ చేశారు. మీ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఆ గతి పట్టిందని ఎద్దేవా చేశారు. వీహెచ్ మాట్లాడిన ఓ వీడియో లింక్ ను ప్రస్తావిస్తూ.. ‘‘NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి’’ అంటూ ట్వీట్ చేశారు.

దీంతో వీహెచ్‌ మరోసారి వర్మపై విరుచుకుపడ్డారు. రాంగోపాల్ వర్మ తెలివి ఏంటో అర్థమవుతోంది అంటూ ఎద్దేవ చేశారు. తాడ ఉందొ లేదో అనేది సమస్య కాదని, ముందు నువ్వు మాట్లాడిన మాటలు గురించి చెప్పంటూ ప్రశ్నించారు. మహిళలు మీద గౌరవం లేదా అన్నారు. వర్మ మహిళలోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. ఏ కేసులు ఉంటే ఆకేసులు వర్మ పై పెట్టాలని, వర్మ తో పాటు వైస్ ఛాన్సలర్ పై కూడా కేసు నమోదు చేయాలన్నారు. సినిమా లోకం కూడా దీనిపై స్పందించాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..