సొంత బ్యానర్లో ఆ డైరెక్టర్‌తో నాగశౌర్య మరో సినిమా.. ఆ ప్రాజెక్ట్‌కు క్లాసీ టైటిల్ ?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 4గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో ఓ సినిమాలో నటిస్తుండగా, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 4గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ చిత్రానికి ఓ క్లాసీ టైటిల్‌ను అనుకుంటున్నాట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్.
లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో నాగశౌర్య నటిస్తున్న సినిమాకు “వరుడు కావలెను” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అలాగే సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి తీస్తున్న సినిమాకు ఇటివల ” లక్ష్య” అనే టైటిల్‌ను ప్రకటించారు. తాజాగా ఈ హీరో తన సొంత బ్యానర్రో అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న సినిమాకు “శ్రీకృష్ణ సత్య” అనే టైటిల్ అనుకుంటున్నారట. తొందర్లోనే ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంకా చదవండి:
ప్రముఖ నవల ఆధారంగా క్రిష్ సినిమా.. ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్న చిత్రయూనిట్