ఆర్చరీ నేపథ్యంలో నాగశౌర్య మూవీ .. ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న యంగ్ హీరో

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా కోసం శౌర్య బాడీని డవలప్ చేసాడు.

  • Rajeev Rayala
  • Publish Date - 5:48 pm, Mon, 30 November 20
ఆర్చరీ నేపథ్యంలో నాగశౌర్య మూవీ .. ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న యంగ్ హీరో

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా కోసం శౌర్య బాడీని డవలప్ చేసాడు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో ఆర్చ‌రీలో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన వ్య‌క్తిగా నాగశౌర్య క‌నిపించ‌నున్నాడు. కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది.

సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కు ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.  ముందుగా ఈ మూవీ కోసం ‘పార్థు’, ‘అర్జున’ అనే టైటిల్స్ అనుకున్నప్పటికీ.. చివరకు ‘లక్ష్య’ అనే టైటిల్ కే చిత్ర యూనిట్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 2021 ప్రారంభంలో ఈ మూవీని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నార‌ట మేక‌ర్స్‌.  ఈ సినిమాతో పాటు ‘వరుడు కావలెను’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కూడా నటిస్తున్నాడు నాగ శౌర్య.