మరోసారి పెద్దమనసు చాటుకున్న లెజెండ్.. తనతో సినిమా తీసి అప్పులపాలైన నిర్మాతకు చేయూతనిస్తున్న బాలకృష్ణ

బాలకృష్ణ కెరీర్‏లో చాలా వరకు హిట్ సినిమాలు ఉన్నా.. వాటితోపాటే కొన్ని డిజాస్టర్స్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో 13 సంవత్సరాల క్రితం తీసిన

మరోసారి పెద్దమనసు చాటుకున్న లెజెండ్.. తనతో సినిమా తీసి అప్పులపాలైన నిర్మాతకు చేయూతనిస్తున్న బాలకృష్ణ
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2020 | 1:36 PM

నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. బాలకృష్ణ కెరీర్‏లో చాలా వరకు హిట్ సినిమాలు ఉన్నా.. వాటితోపాటే కొన్ని డిజాస్టర్స్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో 13 సంవత్సరాల క్రితం తీసిన మహారథి సినిమా ఒకటి. అయితే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వాకాడా అప్పారావు మహారథి సినిమా డిజాస్టర్‏తో తాను పూర్తిగా అప్పులపాలైనట్టు తాజాగా ఓ యూట్యూబ్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

అప్పట్లో ఈ నిర్మాత చంద్రముఖి దర్శకుడు పి.వాసు, నిర్మాత తోటపల్లి మధుతో కలిసి మహారథి సినిమాను తెరకెక్కించాడు. సినిమా మధ్యలో ఫైనాన్షియర్లు తప్పుకోవడంతో వేరే వాళ్ళ దగ్గర నుంచి రూ.10 లక్షల అప్పు తెచ్చి మరీ ఈ సినిమాను పూర్తి చేసాడట. మహారథి సినిమాలో అలనాటి హీరోయిన్ జయప్రద.. బాలకృష్ణకు అత్తగా నటించగా, మీరాజాస్మిన్, స్నేహ, నవనీత్ కౌర్ హీరోయిన్లుగా నటించారు.

ఆ తర్వాత ఓ మధ్యవర్తి ద్వారా బ్యాంకులో రూ.4 కోట్లు లోన్ తీసుకొని 2007 ఫిబ్రవరి 1న ఈ సినిమాను విడుదల చేసాడు వాకాడా. అయితే ఈ సినిమా ఆశించినంతగా హిట్ కాక డిజాస్టర్‏గా మిగిలిపోయింది. దీంతో ఈ మూవీ కోసం చేసిన అప్పును ఇప్పటికీ కడుతూనే ఉన్నానంటూ వాకాడా తెలిపాడు. విషయం తెలుసుకున్న బాలయ్య.. ఎవరైనా మంచి దర్శకుడు, కథ రెడీ చేసుకుంటే.. వాకాడాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలిపాడట. దీంతో వాకాడ మంచి స్టోరీ, దర్శకుడి కోసం వెతుకుతున్నాడట. గతంలో బాలకృష్ణ తనతో సినిమాలు చేసి లాసైన నిర్మాతలతో మళ్ళీ సినిమాలు చేసి వాళ్ళను ఆదుకున్నాడు.

ఇంకా చదవండి: