‌ నయనతారకు షాక్ ఇచ్చిన సమంత, అక్కినేనివారి కోడలుకు అసలు సినిమాలు చేసే ఉద్దేశం ఉందా..?

‌ నయనతారకు షాక్ ఇచ్చిన సమంత, అక్కినేనివారి కోడలుకు అసలు సినిమాలు చేసే ఉద్దేశం ఉందా..?

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టాలీవుడ్ బ్యూటీ సమంత. నయన్‌ బాయ్‌ ఫ్రెండ్ విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో యాక్ట్ చేసేందుకు ముందు ఓకే అన్న సామ్‌...

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Dec 06, 2020 | 2:33 PM

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టాలీవుడ్ బ్యూటీ సమంత. నయన్‌ బాయ్‌ ఫ్రెండ్ విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో యాక్ట్ చేసేందుకు ముందు ఓకే అన్న సామ్‌… తరువాత మాత్రం హ్యాండ్‌ ఇచ్చారు. దీంతో సెట్స్ మీదకు వెళ్లాల్సిన టైంలో హీరోయిన్‌ వేటలో పడ్డారు విఘ్నేష్‌ శివన్‌.

సమంతకు ఇక సినిమాలు చేసే ఉద్దేశం అస్సలు లేనట్టుంది. అందుకే ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి సడన్‌ గా అవుట్‌ అయ్యారు. అసలు సమంత చేతిలో ఉన్నదే ఒక్క సినిమా… అదే తమిళ మూవీ ‘కాత్తువాక్కులె రెండు కాదల్‌’. ఈ మూవీ నుంచే సడన్‌ గా తప్పుకున్నారు సామ్‌. నయన్‌ లీడ్‌ రోల్‌ అని ఫీల్ అయ్యారో.. లేక నయన్‌తో కలిసి యాక్ట్ చేసేందుకే ఫీల్ అయ్యారో గానీ సినిమాను మాత్రం సైడ్‌ చేసేశారు సామ్‌. రీజన్ తెలియక పోయినా చేతిలో ఉన్న ఒక్క సినిమాను కూడా సమంత పక్కన పెట్టేశారు.. దీంతో బేబీకి ఇక సినిమాలు చేసే ఉద్దేశం లేనట్టేనా అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్‌.. వెబ్‌ షోస్‌తో అలరిస్తూనే ఉన్నా.. బిగ్ స్క్రీన్ మీద సామ్‌ కనిపిస్తారో లేదో అని వర్రీ అవుతున్నారు. మరి అభిమానుల కోసమైనా సామ్‌ తన సినిమా కెరీర్‌పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read :

రిటర్నింగ్ ఆఫీసర్ టీఆర్‌ఎస్ కొమ్ముకాసారు.. నేరెడ్‌మెట్ బీజేపీ అభ్యర్థి ప్రసన్న సంచలన ఆరోపణలు

అతిలోకసుందరి కూతురుకు క్రేజీ ఆఫర్స్ ఎందుకు రావడం లేదు, బాలీవుడ్ మేకర్స్ ప్రాబ్లం ఏంటి..?

యాంకర్ భామల ఫోటో షూట్లు : శీతాకాలంలో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు…

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu