Chiranjeevi: సినీకార్మికుల సమస్యల పరిష్కారానికి ముందే ఉంటా.. టాలీవుడ్ కు చిరంజీవి భరోసా

|

May 01, 2022 | 5:33 PM

సినీ పరిశ్రమ(film industry)లో ఉన్న వారి సమస్యల పరిష్కారానికి తానెప్పుడూ ముందే ఉంటానని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) అన్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కష్టపడే కార్మికులు సినీ పరిశ్రమలోనే....

Chiranjeevi: సినీకార్మికుల సమస్యల పరిష్కారానికి ముందే ఉంటా.. టాలీవుడ్ కు చిరంజీవి భరోసా
Chiranjeevi
Follow us on

సినీ పరిశ్రమ(film industry)లో ఉన్న వారి సమస్యల పరిష్కారానికి తానెప్పుడూ ముందే ఉంటానని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) అన్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కష్టపడే కార్మికులు సినీ పరిశ్రమలోనే ఉన్నారని పేర్కొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సినీ కార్మికోత్సవానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ పెద్దలు ఇంతమంది ఈ కార్యక్రమానికి కలిసొచ్చారంటే దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చని చిరంజీవి అన్నారు. బయటి కార్మికులకు నిర్దిష్ట సమయం ఉంటుందన్న చిరంజీవి.. సినీ కార్మికులు మాత్రం రాత్రీపగలూ తేడా లేకుండా పనిచేస్తుంటారని అన్నారు. రావుగోపాలరావు తనతో ‘అల్లుడుగారు.. మీరు కళాకారులు కాదండీ.. కళాకార్మికులు’ అనేవారని తెలిపారు. ‘బామ్మమాట బంగారు బాట’ షూటింగ్‌ సందర్భంగా కారు ప్రమాదం జరిగి నూతన ప్రసాద్‌గారి నడుముకు తీవ్ర గాయమైనా.. ఆయన కాస్త కోలుకున్న తర్వాత సినిమా ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఇబ్బంది పడుతూనే పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఇది గొప్ప త్యాగం కాదా అని ప్రశ్నించారు.

ఎన్నో దశాబ్దాల పాటు ఉద్యమించి పోరాడి తెచ్చుకున్న పండుగ మేడే. కార్మికులను బానిసల్లా చూసే రోజుల్లో ‘మేమూ మనుషులమే. మాకు సామర్థ్యాలు పరిమితంగా ఉంటాయి’అంటూ ఉద్యమించి సాధించుకున్నారు. రోజులో ఉన్న 24 గంటలు శాస్త్రీయంగా విభజించి తీసుకున్న నిర్ణయమే మేడే. తొలిసారి తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉంది. అమెరికా వెళ్లాల్సి ఉన్నా, దాన్ని వాయిదా వేసుకుని, ఈ కార్యక్రమానికి వచ్చా. ఎందుకంటే అమెరికా ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ, ఇలాంటి పండుగలకు ఒక భరోసా ఇచ్చేలా మీతో పాటు నేనూ ఓ కార్మికుడినై ఉంటాను.

            – చిరంజీవి

సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ వంటి వ్యక్తులు సినీ ఇండస్ట్రీలోనూ ఉన్నారని చిరంజీవి అన్నారు. దర్శకులు కే.బీ.తిలక్‌గా నటుడిగా మారిన తర్వాత ఒక సినిమా చేస్తున్నారు. అప్పుడు ఆయన వయసు 70ఏళ్లు. ఆ సినిమా షష్టిపూర్తి సీన్‌ తీస్తున్నారు. పెళ్లికొడుకు వేషంలో ఉన్నారు. అదే సమయంలో భార్య చనిపోయిందని ఫోన్‌ వచ్చింది. తన వల్ల షూటింగ్‌ ఆగిపోతే నిర్మాతకు నష్టం వస్తుందని, బాధను దిగమింగుకొని ఆ రోజు చిత్రీకరణ పూర్తి చేశారు’ ఇలా ఎంతో మంది త్యాగాలు చేశారని చిరంజీవి వివరించారు.

మరిన్ని ఎంటర్టైన్ మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Rakul Preet Singh: ట్రెండీ లుక్కులో చూపుతిప్పుకోనివ్వని రకుల్.. స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతున్న పంజాబీ అమ్మడు..

Students Fighting: విద్యార్థులా..! వీధి రౌడీలా..! కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు..