
సూపర్‌స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పించాలని డిమాండ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన చిరంజీవి.. ఇప్పుడు సౌత్‌లో ఉన్న సీనియర్ హీరోలలో కృష్ణ ఒకరని.. 350కు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు ఇంకా దక్కాల్సిన గౌరవం దక్కలేదని అన్నారు. భారత అత్యున్నత పురస్కారాల్లో ఒక్కటైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు వచ్చే విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేయాలి ఈ సందర్భంగా చిరు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాను రిక్వెస్ట్ కాకుండా డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. అయినా కృష్ణకు ఈ అవార్డు దక్కితే.. ఆయనకు మాత్రమే కాదని.. తెలుగు వారందరికీ గౌరవం దక్కినట్లని చిరు తెలిపారు. హీరోగా, నిర్మాతగా సినిమాల్లో కృష్ణ గారు ఎన్నో సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు.
Chiranjeevi demands Dadasaheb Phalke Award for Superstar Krishna #Chiranjeevi #DadasahebPhalkeAward #SuperstarKrishna pic.twitter.com/RXTpRM0Nts
— TV9 Telugu (@TV9Telugu) January 5, 2020