AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi Movie: ఇరుముడి సినిమాలో రవితేజ కూతురిగా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఛాన్స్ ఎలా వచ్చిందంటే..

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఇరుముడి ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చేసింది. మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాతో తన అమాయకత్వం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆ చిన్నారి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది.

Irumudi Movie: ఇరుముడి సినిమాలో రవితేజ కూతురిగా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఛాన్స్ ఎలా వచ్చిందంటే..
Irumudi
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2026 | 3:41 PM

Share

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ ద్వారా విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈమూవీ ఇప్పుడు ఆగస్ట్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఉదయం నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవనానీ శంకర్ కథానాయికగా నటించింది. అలాగే ఇందులో రవితేజ కూతురిగా కనిపించి తన అమాయకత్వం, నటనతో ప్రేక్షకులు అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చే చేస్తున్నారు నెటిజన్స్. ఇరుముడి చిత్రంలో మణికంఠ అనే పాత్రలో నటించిన ఈ చిన్నారి పేరు బేబీ నక్షత్ర. ప్రస్తుతం తాను ఏడవ తరగతి చదువుతున్నానని తెలిపింది. ఈ సినిమాలో తనకు ఎలా ఛాన్స్ వచ్చిందనే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకోచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

గురువారం హైదరాబాద్ లో విలేకర్లతో ముచ్చటించింది నక్షత్రం. ఇప్పుడు వరకు తాను ఆరు సినిమాలు చేశానని వెల్లడించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేయడం.. ఆ భాషలు, సంస్కృతిని అర్థం చేసుకుంటూ మూవీస్ చేయడం తనకు మంచి అనుభవం అని.. ఇన్ స్టాలో తాను చేసిన రీల్స్ చూసి డైరెక్టర్ శివ నిర్వాణ తనకు ఇరుముడి మూవీలో నటించే ఛాన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఇందులో మణికంఠ అనే అమ్మాయిగా కనిపిస్తానని.. రవితేజ కూతురిగా కనిపించే పాత్ర అని తెలిపింది. రవితేజ, ప్రియ భవానీ శంకర్ ఇద్దరూ తనతో ఎంతో స్నేహంగా ఉన్నారని.. డైరెక్టర్ శివ నిర్వాణ సహకారంతో ఆడుతూ పాడుతూ చిత్రీకరణ కంప్లీట్ చేశానని తెలిపింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

తెలుగు భాష తనకు అర్థమవుతుందని.. అందుకే తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకున్నానని అన్నారు. సీలేరులో చిత్రీకరణ కావడం.. ఆ ప్రాంతమంతా తనకు కేరళలాగే అనిపించిందని తెలిపింది. తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే సినిమాలు చేయగల్గుతున్నానని.. ఇప్పటివరకు పృథ్వీరాజ్ సుకుమారన్, శివరాజ్ కుమార్, రవితేజ వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేయడం చాలా బాగుందని వెల్లడించింది. ప్రస్తుతం ఆ అమ్మాయి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Follow Us