AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పోలీసుల వేధింపులంటూ సెల్ఫీ వీడియో.. ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం!

నిజామాబాద్‌లో పోలీసుల వేధింపులు తట్టుకోలేక నర్సింగ్ రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేసి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్, ఇద్దరు ఎస్ఐలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. చిన్న విషయాలకు పిలిచి వేధిస్తున్నారని, తనపై తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై విచారణ జరగాలి.

Telangana: పోలీసుల వేధింపులంటూ సెల్ఫీ వీడియో.. ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం!
Viral Selfie Video
Balaraju Goud
|

Updated on: Aug 21, 2026 | 3:32 PM

Share

నిజామాబాద్‌లో ఓ వ్యక్తి పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. శివాజీనగర్‌కు చెందిన నర్సింగ్ రెడ్డి.. ఇద్దరు ఎస్ఐలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని గమనించి, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింగ్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తన ఆత్మహత్యాయత్నానికి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన మాజీ ఎస్ఐ ముజాయిద్, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎస్ఐ యాదగిరి కారణమంటూ నర్సింగ్ వీడియోలో ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికి, ప్రతి కేసులో తనను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల తీరుతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు నర్సింగ్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే, కుటుంబ వివాదానికి సంబంధించి తన తమ్ముడు యాదిరెడ్డి ఇబ్బంది పెడుతున్నాడంటూ నర్సింగ్ గతంలో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే తన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోకుండా, తనపైనే కేసు నమోదు చేశారని నర్సింగ్ ఆరోపిస్తున్నాడు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

నర్సింగ్ రెడ్డి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది. నర్సింగ్ చేసిన ఆరోపణలు నిజమా? కుటుంబ వివాదంలో అసలు ఏం జరిగింది? అతడిపై కేసు ఎందుకు నమోదైంది? అనే అంశాలపై విచారణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..
ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..
సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!
సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి