Rakul Preet Instagram Post: ‘కెరటం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. తొలి సినిమాతోనే నటనతో మంచి మార్కులు కొట్టేసిన రకుల్.. అనంతరం వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. అనంతరం ‘లౌక్యం’, ‘పండగ చేస్కో’, ‘నాన్నకు ప్రేమతో సినిమాతో ఒక్కసారిగా బిజీ హీరోయిన్‌గా మారింది.
టాలీవుడ్‌లో దాదాపు అందరు యంగ్ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ.. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకోవడం రకుల్‌కు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ త్రో బ్యాక్ ఫొటోను పోస్ట్ చేసింది. గతంలో రకుల్ కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లినప్పుడు దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నేను రోజూ తీసుకునే థెరపీ.. నవ్వే’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది. ఇక ఈ ఫొటోలో బికినీలో దర్శనమిచ్చిన రకుల్ ఆకట్టుకుంటోంది. ఈ అందాల తార ప్రస్తుతం.. తెలుగులో ‘చెక్’తో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. రకుల్ తొలిసారి ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌లో నటిస్తోంది. ఇక వీటితో పాటు తమిళ, హిందీలో కొన్ని సినిమాలతో బిజీగా ఉంది.