
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనంలా దూసుకొచ్చింది కాంతార చిత్రం. కేజీఎఫ్ చిత్రం ద్వారా మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని దేశానికి పరిచయం చేసిందీ చిత్రం. విడుదల వరకు అసలు ఎవరికీ తెలియని ఈ సినిమా.. విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనూహ్య విజయంతో ప్రాంతాలు, భాషలకు అతీతంగా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. రిషబ్ శెట్టి నటన, అద్భుత దర్శకత్వంతో ఈ సినిమా విజయతీరాలను అందుకుంది. ఒక్క తెలుగులోనే ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లు రాబట్టింది అంటే కాంతార స్టామినా ఏంటో అర్థం అవుతుంది.
కలెక్షన్లకే పరిమితం కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుందీ చిత్రం. యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాను వీక్షిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ జాబితాలోకి కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మాల సీతారామన్ కూడా వచ్చి చేరారు. బుధవారం బెంగళూరులో చిత్రాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
With a team of volunteers and well-wishers watched #KantaraMovie in Bengaluru.
Well made @shetty_rishab (writer/director/actor).?
The film captures the rich traditions of Tuluvanadu and Karavali.@rajeshpadmar @SamirKagalkar @surnell @MODIfiedVikas @KiranKS @Shruthi_Thumbri pic.twitter.com/vVbbk5fNno
— Nirmala Sitharaman (@nsitharaman) November 2, 2022
థియేటర్‌లో సినిమాను వీక్షించిన నిర్మాలా ట్వీట్ చేస్తూ..’వాలంటీర్లు, శ్రేయోభిలాషుల బృందంతో కలిసి బెంగళూరులో సినిమాను చూశాను. సినిమాను బాగా తెరకెక్కించారు. ఈ చిత్రం తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది’అంటూ రాసుకొచ్చారు. థియేటర్‌లో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇక తెలుగులో రూ. 50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. అత్యధిక కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లకుపైగా రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..