Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

అషూరెడ్డి (Ashu Reddy).. జూనియర్ సమంత(Samantha) గా పేరు తెచ్చుకున్న ఈ బుల్లితెర బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

Updated on: Jan 27, 2022 | 9:11 PM

అషూరెడ్డి (Ashu Reddy).. జూనియర్ సమంత(Samantha) గా పేరు తెచ్చుకున్న ఈ బుల్లితెర బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  సోషల్​ మీడియాతో తెచ్చుకున్న క్రేజ్ తో బిగ్​బాస్ (Biggboss)​ హౌస్ లో అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది.  వీటితో నెట్టింట్లో గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇక ఆర్టీవీతో చేసిన ఇంటర్వ్వూతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇటీవల తన అభిమాన నటి సమంత ‘ఉ అంటావా’ పాటను రీక్రియేట్ చేసి ఆకట్టుకుంది.

సారీ అలియా..

కాగా అప్పుడప్పుడు టూర్ లు, వెకేషన్లు అంటూ తిరిగే ఈ ముద్దుగుమ్మ తాజాగా దుబాయ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ప్రఖ్యాత ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంను సందర్శించింది.  అక్కడ ఏర్పాటుచేసిన సెలబ్రిటీల మైనపు బొమ్మలతో ఫొటోలు దిగింది. ఇందులో భాగంగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ మైనపు బొమ్మతో ఇలా ఫోజులిచ్చింది. అనంతరం ఆ ఫొటోలన తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. దీనికి ‘సారీ అలియా భట్’​ అని ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.   నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Horoscope Today: ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Republic day 2022: రిపబ్లిడ్‌ డే శకటాలను ఎలా రూపొందిస్తారు? అసలు పరేడ్‌లో పాల్గొనే శకటాల ప్రక్రియ ఎంపికలో విధి విధానాలేంటంటే..

Kidney Stones: మీకు కిడ్నిల్లో రాళ్ల ఏర్పడ్డాయా..? వాటిని కరిగించాలంటే వీటిని పాటించడండి..!