కన్నీటి కడలిని చిరునవ్వుతో దాటేస్తోంది.. ఈ ముద్దుగుమ్మ అంటే మన హీరోలందరికీ అభిమానమే.. ఎవరో గుర్తుపట్టగలరా..

సోషల్‌ మీడియా రాకతో సినీ తారలకు వారి అభిమానులకు మధ్య దూరం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఒకప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్ల గురించి తెలియాలంటే కేవలం వార్తా పత్రికలు, టీవీ ఛానల్లే ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ స్థానాన్ని సోషల్‌ మీడియా భర్తీ చేస్తోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన..

కన్నీటి కడలిని చిరునవ్వుతో దాటేస్తోంది.. ఈ ముద్దుగుమ్మ అంటే మన హీరోలందరికీ అభిమానమే.. ఎవరో గుర్తుపట్టగలరా..
Guess The Actress

Updated on: May 22, 2023 | 7:22 PM

సోషల్‌ మీడియా రాకతో సినీ తారలకు వారి అభిమానులకు మధ్య దూరం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఒకప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్ల గురించి తెలియాలంటే కేవలం వార్తా పత్రికలు, టీవీ ఛానల్లే ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ స్థానాన్ని సోషల్‌ మీడియా భర్తీ చేస్తోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివరాలను సైతం అభిమానులతో పంచుకుంటున్నారు. పైన ఉన్న ఫొటోలో ఉన్న బ్యూటీ కూడా ఈ జాబితాలోకి వస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుందీ చిన్నది.

సోఫాపై పడుకుని ఉన్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.? ముఖానికి చేయి అడ్డం పెట్టుకొని రిలాక్స్‌ అవుతోన్న ఈ చిన్నది టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ చెక్కుచెదరని స్టార్‌డమ్‌తో దూసుకుపోతోంది. సినిమాలకే పరిమితం కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ మెప్పిస్తోంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బ్యూటీకి ఈ స్టార్‌ డమ్‌ అంత సులభంగా మాత్రం రాలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.

ఇవి కూడా చదవండి

కెరీర్ పరంగా పెద్దగా ఎలాంటి ఒడిదొడుకులు లేకపోయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. జీవితం విసిరిన కష్టాలను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కొన్నేళ్లకు విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. అంతలోనే అరుదైన వ్యాధితో బాధపడే పరిస్థితి వచ్చింది. అయితే వీటన్నింటినీ తట్టుకొని ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారు కదూ! అవును మీరు అనుకుంటోది నిజమే. ఈ చిన్నది మరెవరో కాదు అందాల తార సమంతానే. మయోసైటిస్‌ నుంచి క్రమంగా కోలుకుంటున్న సామ్‌ ప్రస్తుతం పూర్తిగా కెరీర్‌పై దృష్టిసారించింది. వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ దూసుకుపోతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..