బన్నీ రెడీగా లేడా..?

బన్నీ రెడీగా లేడా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడో చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన వచ్చి కూడా దాదాపుగా రెండు నెలలు కావోస్తోంది. అయితే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అల్లు అర్జు్న్ మాత్రం లేదన్నది టాలీవుడ్ టాక్. నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా తరువాత ఏడు నెలలు కుటుంబానికే కేటాయించిన బన్నీ కాస్త బరువెక్కాడు. ఈ క్రమంలో తదుపరి చిత్రానికి మళ్లీ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:58 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడో చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన వచ్చి కూడా దాదాపుగా రెండు నెలలు కావోస్తోంది. అయితే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అల్లు అర్జు్న్ మాత్రం లేదన్నది టాలీవుడ్ టాక్.

నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా తరువాత ఏడు నెలలు కుటుంబానికే కేటాయించిన బన్నీ కాస్త బరువెక్కాడు. ఈ క్రమంలో తదుపరి చిత్రానికి మళ్లీ ఫిట్‌గా మారేందుకు ఇంకా కాస్త సమయం పడుతుందని బన్నీ, త్రివిక్రమ్‌తో చెప్పాడట. దీంతో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా సమయం పడుతుందన్నది ఫిలింనగర్ సమాచారం. మరోవైపు ఈ చిత్రంతో పూజా హెగ్డే రెండోసారి బన్నీతో, త్రివిక్రమ్‌తో పనిచేయబోతుందన్నట్లు కూడా తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్, రాధా కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu