What India Thinks Today: టీవీ 9 నెట్‏వర్క్ ‘నక్షత్ర సమ్మాన్’ అందుకున్న కేజీఎఫ్ నటి..

|

Feb 25, 2024 | 6:59 PM

మొదటి రోజు గ్లోబల్ సమ్మిట్‏లో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్‌ పాల్గొన్నారు. ఆమెను టీవీ9 నెట్‌వర్క్ నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించారు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్.. టీవీ9 సీఈవో బరున్ దాస్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రవీనా టాండన్‌కు 'నక్షత్ర సమ్మాన్' అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రవీనా టాండన్ అవార్డు అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది.

What India Thinks Today: టీవీ 9 నెట్‏వర్క్ నక్షత్ర సమ్మాన్ అందుకున్న కేజీఎఫ్ నటి..
Raveena Tandon
Follow us on

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ 2024’ ప్రారంభమయ్యింది. ఈ సంవత్సం ఈ సమ్మిట్‏ను మరింత పెద్దదిగా.. గ్రాండ్‏గా నిర్వహిస్తుంది టీవీ9. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో దేశంలోని రాజకీయన నాయకులు, వ్యాపారవేత్తలతోపాటు సినీ ప్రముఖులు పాల్గొంటారు. ఈరోజు మొదటి రోజు గ్లోబల్ సమ్మిట్‏లో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్‌ పాల్గొన్నారు. ఆమెను టీవీ9 నెట్‌వర్క్ నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించారు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్.. టీవీ9 సీఈవో బరున్ దాస్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రవీనా టాండన్‌కు ‘నక్షత్ర సమ్మాన్’ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రవీనా టాండన్ అవార్డు అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది. అలాగే టీవీ 9 నెట్‌వర్క్‌కు ధన్యవాదాలు తెలిపారు.

చాలా దశాబ్దాలుగా హిందీ చిత్రసీమను ఏలిన రవీనా టాండన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ గౌరవానికి చాలా ధన్యవాదాలని.. మనకు 90వ దశకంలో మాత్రమే ప్రసిద్ధి చెందామని, మనం ఇంతకుముందులాగానే నేటికీ ఉన్నామని అన్నారు. మనం ఎప్పటికీ ఇక్కడే ఉండబోతున్నామని అన్నారు. తనను ప్రశంసించిన ప్రతిసారి తనకు మంచి అనుభూతి కలుగుతుందని అన్నారు. అది తన తొలి అవార్డు అయినా, ఇప్పుడు అందుకున్న టీవీ9 నక్షత్ర సమ్మాన్ అవార్డు అయినా. ఎవర్ షైనింగ్ స్టార్ అవార్డు తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది.

రవీనా టాండన్ సినీ ప్రయాణం..
రవీనా టాండన్ 1991లో ‘పత్తర్ కే ఫూల్ ‘చిత్రంతో తన హిందీ సినీ పరిశ్రమలో చలనచిత్ర ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌ జోడిగా రవీనా టాండన్ కనిపించింది. తన మొదటి సినిమాకే ‘ఫిల్మ్‌ఫేర్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది. రవీనా తన కెరీర్‌లో అందాజ్ అప్నా అప్నా, మొహ్రా, దిల్‌వాలే, లాడ్లా, జిద్ది, దీవానా మస్తానా, దుల్హే రాజా, షూల్ వంటి అనేక గొప్ప చిత్రాలలో నటించింది. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ రంగంలోనూ తనను తాను నిరూపించుకుంది. అరణ్యక, కర్మ కాలింగ్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించి సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

WITT ఈవెంట్ లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.