Singham Again: సూపర్ హిట్ సినిమాకు పార్ట్ 3 సిద్ధం.. ఈసారి లేడీ సింగం కూడా..

| Edited By: Rajeev Rayala

Aug 12, 2023 | 11:17 AM

బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న రోహిత్.. వరుసగా కాప్‌ డ్రామాలతో అలరిస్తున్నారు. అలాంటి రోహిత్‌ కెరీర్‌లో బిగ్‌ హిట్‌గా నిలిచిన కాప్‌ మూవీ సింగం. హీరో సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సౌత్ బ్లాక్ బస్టర్ సింగం సినిమాను అజయ్ దేవగన్‌ హీరోగా అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు రోహిత్‌. తొలి భాగం సూపర్ హిట్‌ కావటంతో సొంత కథతో సింగం సీక్వెల్‌ను రూపొందించారు.

Singham Again: సూపర్ హిట్ సినిమాకు పార్ట్ 3 సిద్ధం.. ఈసారి లేడీ సింగం కూడా..
Singam
Follow us on

సౌత్‌ బ్లాక్ బస్టర్‌ సింగం సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేశారు నార్త్ స్టార్స్‌. అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కాన్సెప్ట్ నార్త్ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ కావటంతో సొంతం కథలతో సీక్వెల్‌ కూడా తీసి సక్సెస్ అయ్యారు. అందులో కూడా అజయ్ దేవగన్ హీరోగా నటించాడు.ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ రూపొందనుంది. అయితే పార్ట్ 3 కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్నారు నార్త్ మేకర్స్. బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న రోహిత్.. వరుసగా కాప్‌ డ్రామాలతో అలరిస్తున్నారు. అలాంటి రోహిత్‌ కెరీర్‌లో బిగ్‌ హిట్‌గా నిలిచిన కాప్‌ మూవీ సింగం. హీరో సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సౌత్ బ్లాక్ బస్టర్ సింగం సినిమాను అజయ్ దేవగన్‌ హీరోగా అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు రోహిత్‌. తొలి భాగం సూపర్ హిట్‌ కావటంతో సొంత కథతో సింగం సీక్వెల్‌ను రూపొందించారు. సింగం రిటర్న్స్ పేరుతో రిలీజ్ అయిన సింగం 2 కూడా సూపర్ హిట్ కావటంతో.. ఈ ఫ్రాంచైజీలో మరిన్ని మూవీస్‌ ప్లాన్ చేశారు రోహిత్‌, అజయ్‌.

రీసెంట్‌గా సింగం ఎగైన్ పేరుతో త్రీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో అజయ్‌తో పాటు ఓ లేడీ సింగంను కూడా చూపించబోతున్నారట రోహిత్‌. ప్రజెంట్‌ వరుసగా యాక్షన్ రోల్స్ చేస్తున్న దీపిక పడుకోన్‌ సింగం 3లో అజయ్‌ దేవగన్‌ సిస్టర్‌ రోల్‌లో కనిపించబోతున్నారు.

గతంలో రోహిత్ శెట్టి తెరకెక్కించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ దీపిక కెరీర్‌ను మలుపు తిప్పింది. అందుకే ఇప్పుడు సింగం సిరీస్‌లో సిస్టర్‌లో చేసేందుకు ఓకే చెప్పారు దీపిక. దాదాపు 40 నిమిషాలు పాటు కనిపించే ఎక్స్‌టెండెడ్‌ గెస్ట్‌ రోల్‌లో దీపిక యాక్షన్ సీన్స్‌లో కూడా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కల్కీ సినిమాలో నటిస్తుంది దీపికా. అలాగే షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న జవాన్ లోనూ స్పెషల్ రోల్ లో కనిపించనుంది దీపికా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.