Vijay Devarakonda: కొత్త సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన రౌడీ.. ఈసారి విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌..

Vijay Devarakonda New Movie: అర్జున్ రెడ్డి అనే ఒక్క చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌నదైన మేన‌రిజంతో యూత్‌ను అట్రాక్ట్ చేసిన విజ‌య్ ఎక్క‌డ‌లేని క్రేజ్‌ను సొంతం...

Vijay Devarakonda: కొత్త సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన రౌడీ.. ఈసారి విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌..
Vijay New Movie

Updated on: May 06, 2021 | 5:57 AM

Vijay Devarakonda New Movie: అర్జున్ రెడ్డి అనే ఒక్క చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌నదైన మేన‌రిజంతో యూత్‌ను అట్రాక్ట్ చేసిన విజ‌య్ ఎక్క‌డ‌లేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కాకుండా రౌడీ వియ‌ర్ పేరుతో వ్యాపార రంగంలోకి దిగి త‌న‌దైన మార్క్ చూపించాడు. ఇక ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ చిత్రంతో బాలీవుడ్ బాట ప‌ట్టాడు విజ‌య్. ఈ సినిమాతో బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు.

Vijay Katrina

ఇదిలా ఉంటే ఇంకా ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే విజ‌య్ మ‌రో బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే విజ‌య్ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని బాలీవుడ్ ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రైన క‌త్రినా కైఫ్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని స‌మాచారం. ఇక ఇటీవ‌లే క‌త్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఫాలో అవ‌డం మొద‌లు పెట్టింది. దీంతో వీరిద్ద‌రి క‌లిసి నటించ‌నున్నార‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్ల‌యింది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌టన వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Pooja Hegde: కోవిడ్‏ను జయించిన పూజా హెగ్డే… స్టుపిడ్‌ కరోనాను తన్నేశా అంటూ ట్వీట్..

అషు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్.. అసలు విషయాన్ని చెప్పిన సింగర్.. ఏడుపొచ్చేస్తోంది అంటూ అషు ట్వీట్..

రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..