Bollywood : ఆర్ధికంగానూ దెబ్బకొడుతున్న కరోనా.. ఏకంగా 2 కోట్ల సెట్ ను కూల్చేశారట..

|

May 14, 2021 | 6:34 PM

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుడి దగ్గరి నుంచి సెలబ్రీటీల వరకు అందరినీ.. ఇటు ఆరోగ్య పరంగానూ.. అటు ఆర్థిక పరంగానూ విపరీతంగా దెబ్బతీస్తోంది...

Bollywood : ఆర్ధికంగానూ దెబ్బకొడుతున్న కరోనా.. ఏకంగా 2 కోట్ల సెట్ ను కూల్చేశారట..
Follow us on

Bollywood :

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుడి దగ్గరి నుంచి సెలబ్రీటీల వరకు అందరినీ.. ఇటు ఆరోగ్య పరంగానూ.. అటు ఆర్థిక పరంగానూ విపరీతంగా దెబ్బతీస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో సినిమాలు షూటింగ్స్ అనేవి అసలే సాధ్యం కావు. కానీ ఎంతో గ్రాండ్ గా షూటింగ్ జరుపుకోవాలని వేసుకున్న సినిమా సెట్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. వాటి కిరాయిలు చెల్లించలేక నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఈ మహమ్మారి కారణంగానే ఓ బీ టౌన్‌ ప్రొడ్యూసర్‌ ఒక్క రోజులోనే 2 కోట్లను నష్ట పోవాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే..

ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా ‘థాంక్ గాడ్’. టీ సిరీస్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక జనవరిలో షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.అయితే ముంబైలోని ఓ స్టూడియోలో 2కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారట ఈ మూవీ మేకర్స్‌. కానీ ఈ సెట్‌లో ఒక్క రోజు కూడా చిత్రీకరణ జరపకపోయినా భారీగా రెంట్ కట్టాల్సి వస్తోందట. దాంతో చేసేదేం లేక ఈ సెట్‌ను నేల కూల్చారట ఈ మూవీ మేకర్స్‌ . కానీ సినిమా జనవరి నెలలో షూట్ మొదలైందో లేదో అప్పుడే కరోనా వ్యాప్తి చెందడంతో షూటింగ్స్ నిలుపుకొని ఇంటిపట్టునే ఉంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jagapathi Babu: మన బుద్దులు మారకుంటే.. ప్రకృతి మనకు గట్టిగా బుద్ది చెబుతుంది : జగపతిబాబు

కష్టసమయంలో ముందుకువచ్చిన హీరోలు…ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీవిరాళాలు అందించిన సినిమాతారలు..

Sonu Sood: పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం.. ప్రశంసలు కురిపించిన ఆసుపత్రి యాజమాన్యం..

టాలీవుడ్‌లో మరో విషాదం..! కరోనాతో డైరెక్టర్, రచయిత నంద్యాల రవి కన్నుమూత