Viral video: సంగీతానికి సరిహద్దుల్లేవని నిరూపించారు.. బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌ను అద్భుతంగా రీక్రియేట్‌ చేసిన టాంజానియా అన్నాచెల్లెళ్లు..

|

Nov 29, 2021 | 11:31 AM

బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా, ముద్దుగుమ్మ కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం 'షేర్షా'. కార్గిల్‌ పోరాట యోధుడు విక్రమ్‌ బాత్రా..

Viral video: సంగీతానికి సరిహద్దుల్లేవని నిరూపించారు..  బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌ను అద్భుతంగా రీక్రియేట్‌ చేసిన టాంజానియా అన్నాచెల్లెళ్లు..
Follow us on

బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా, ముద్దుగుమ్మ కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘షేర్షా’. కార్గిల్‌ పోరాట యోధుడు విక్రమ్‌ బాత్రా జీవిత కథ ఆధారంగా విష్ణు వర్ధన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 12 న అమెజాన్‌ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో సిద్ధార్థ్‌- కియారాల కెమిస్ట్రీ చాలా బాగుందని ప్రశంసలు వినిపించాయి. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘రాతన్‌ లంబియాన్‌’ అనే సాంగ్‌ సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలోనూ ఈ పాటకు ఎంతో క్రేజ్‌ ఉంది. పలువురు నెటిజన్లు ఈ పాటకు రీక్రియేషన్‌, స్ఫూప్‌లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

కాగా ‘రాతన్‌ లంబియాన్‌’ పాటకు టాంజానియాకు చెందిన టిక్‌టాక్‌ సెన్సేషన్‌ కిలీపాల్‌, అతని సోదరి నీమా రీక్రియేట్‌ చేశారు. పాటలోని లిరిక్స్‌కు తగ్గట్టుగా అద్భుతంగా లిప్‌ సింక్‌ చేస్తూ, ఎక్స్‌ప్రెషన్లతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘షేర్షా’ హీరో, హీరోయిన్లు సిద్ధార్థ్‌, కియారా అద్వానీ, ఒరిజనల్‌గా ఈ పాటను ఆలపించిన సింగర్‌ జుబిన్‌ నౌటియాల్‌ సైతం ఈ సాంగ్‌కు ముగ్ధులయ్యారు. నెటిజన్లు కూడా ‘సంగీతానికి సరిహద్దుల్లేవని వీరిద్దరూ మరోసారి నిరూపించారు’ అంటూ కిలీపాల్‌- నీమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా టిక్‌టాక్‌ సెన్సేషన్‌గా కిలీపాల్‌కు ఆఫ్రికా ఖండంలో ఎంతో క్రేజ్‌ ఉంది. అతను చేసే టిక్‌టాక్‌ వీడియోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. కిలీపాల్‌ను టిక్‌టాక్‌లో 1.5 మిలియన్ల మంది అనుసరిస్తుండడం విశేషం.

Amitabh bachchan: కూతురు, మనవరాలి కోసం జిలేబీ లాంటి ప్రశ్నలు సిద్ధం చేసిన బిగ్‌ బీ.. ఆసక్తికరంగా కేబీసీ వెయ్యో ఎపిసోడ్‌ ప్రోమో..

Shilpa Chaudhary: కిట్టీ పార్టీల పుట్టి కదులుతోంది.. తవ్వేకొద్ది వెలుగులోకి శిల్పా మోసాల పుట్ట.. కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్

Shiva Shankar Master Death: తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు..