Ramayana: రణబీర్ రామాయణానికి హనుమంతుడు దొరికేశాడు.. సైనికుడి నుంచి రామభక్తుడిగా మారనున్న నటుడు.. ఎవరంటే..

తండ్రి ధర్మేంద్ర వారసత్వాన్ని కొనసాగిస్తూ వెండి తెరపై అడుగు పెట్టిన సన్నీ డియోల్ 25 ఏళ్ళ కెరీర్ లో రెండు జాతీయ పురస్కారాలు, రెండు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. ప్రస్తుతం బోర్డర్ 2 సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. అయితే సన్నీ డియోల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసుకోవడానికి అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో సన్నీ తన నెక్స్ట్ సినిమా గురించి ఒక బిగ్ ఆప్దేట్ ఇచ్చాడు. రణబీర్ కపూర్ 'రామాయణం'లో నటించనున్నట్లు తెలిపాడు. మరి రామాయణంలో ఎటువంటి పాత్రలో నటించనున్నాడో తెలుసా..

Ramayana: రణబీర్ రామాయణానికి హనుమంతుడు దొరికేశాడు.. సైనికుడి నుంచి రామభక్తుడిగా మారనున్న నటుడు.. ఎవరంటే..
Ramayanam

Updated on: Jun 23, 2025 | 4:27 PM

సన్నీ డియోల్ లో ఇప్పుడు వరస సినిమాల్లో నటిస్తున్నాడు. సన్నీ నటించిన ‘జాత్’ సినిమా విమర్శలకుల నుంచి ప్రశంసలను అందుకున్నా.. కలెక్షన్ల పరంగా చూస్తే.. వెనుకబడి ఉంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం సన్నీ నటించిన బోర్డర్ 2 సినిమాపై అందరి దృష్టి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘బోర్డర్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే సన్నీ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు సన్నీ. అదే ‘రామాయణం’ సినిమా గురించి చాలా ఆసక్తి కరమైన విషయం వెల్లడించాడు. అతను రణబీర్ కపూర్ చిత్రంలో హనుమంతుడి పాత్రను పోషించనున్నాడు. రామాయణం సినిమా షూటింగ్ గురించి పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? తెలుసా.

ఇటీవలే సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ మూడవ షెడ్యూల్‌ను ప్రారంభించాడు. సన్నీ డియోల్ ముగ్గురు సైనికులు పూణేలోని NDAలో అతనితో పాటు ఉన్నారు. వారిలో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి ఉన్నారు. దీని తర్వాతే సన్నీ డియోల్ ఇతర చిత్రాల షూటింగ్ కు వెళ్లనున్నాడు. ఈ సినిమాలో సన్నీ డియోల్ తాను హనుమంతుడి పాత్రను పోషిస్తున్నానని.. ఈ సినిమాలో నటించే సమయం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు.

సన్నీ డియోల్ ఏ అప్‌డేట్ ఇచ్చాడంటే

ఇటీవల సన్నీ డియోల్ జూమ్‌తో మాట్లాడుతూ హనుమంతుడి పాత్రను ధ్రువీకరించాడు. రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’లో తన పాత్ర గురించి అతను ఇప్పటికే మాట్లాడాడు. ఇప్పుడు అతను ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను పోషిస్తున్నానని చెప్పాడు. ఈ సినిమాలో నటించే సమయం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. అంటే బోర్డర్ 2’ మూడవ షెడ్యూల్ తర్వాత, ఈ సినిమా తదుపరిది అవుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సన్నీ ఈ సినిమా తారాగణాన్ని కూడా ప్రశంసించాడు.

ఇవి కూడా చదవండి

సన్నీ డియోల్ రామాయణంలో తన పాత్ర అద్భుతంగా, అందంగా ఉంటుందని చెప్పాడు. హనుమంతుడి పాత్రను పోషించడానికి తాను ఎంత ఉత్సాహంగా ఉన్నాడో.. అదే సమయంలో ఎంత భయపడుతున్నాడో చెప్పాడు. ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం అని సన్నీ అన్నారు.

రణ్‌బీర్‌తో సహకారం గురించి సన్నీ ఏమన్నాడంటే

రణబీర్ కపూర్ గురించి సన్నీ డియోల్ మాట్లాడుతూ రణబీర్ కపూర్ గొప్ప నటుడు. అతనితో కలిసి పనిచేయడం బాగుంటుందని అన్నారు. అతను ఏ ప్రాజెక్ట్‌లో పనిచేసినా అతను తన 100 శాతం అంకితభావంతో పనిచేస్తాడు. నితేష్ తివారీ రణబీర్ కపూర్ రామాయణానికి దర్శకత్వం వహిస్తున్నారు. యష్ , నమిత్ కలిసి దీనిని నిర్మిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుండగా.. పార్ట్ 2 కోసం 2027 వరకు వేచి ఉండాలి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీతాదేవిగా.. యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..